మోడ్రన్ ఇండియన్ హిస్టరీ: గ్రూప్స్ ఎగ్జామ్స్ స్పెషల్
పోర్చుగీసు మొట్టమొదటి గవర్నర్ - ఫ్రాన్సిస్ -డీ-అల్మీడా.
పోర్చుగీసు, బ్రిటీష్ వారి రాక :
ప్రధాన కేంద్రం -గోవా
పోర్చుగీసు మొట్టమొదటి గవర్నర్ - ఫ్రాన్సిస్ -డీ-అల్మీడా.
ఇతను నీలి నీటి విధానం(Blue Water Policy) ప్రవేశపెట్టాడు.
ఈ విధానం ప్రకారం పోర్చుగీసు వారు భారతదేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా అరేబియా సముద్ర వర్తకంపై ఆధిపత్యం కోసం ప్రయత్నించారు.
పోర్చుగీసు గవర్నర్ అల్బూక్వెర్క్ నీలినీటి విధానాన్ని రద్దు చేశాడు.
1510లో గోవాను బీజాపూర్ నుండి ఆక్రమించాడు. (ఈ ఆక్రమణలో అల్బూక్వెర్క్‌కు సహకరించిన భారతీయ రాజు -శ్రీకృష్ణదేవరాయలు) ఇతను భారతీయ మహిళను వివాహమాడమని ప్రోత్సహించాడు.
1530లో పోర్చుగీసు గవర్నర్ నీనా-డ-కున్హా.. పోర్చుగీసు ప్రధాన కేంద్రాన్ని కొచ్చి నుండి గోవాకు మార్చాడు.
1534లో గుజరాత్ నుండి బస్సైన్‌ను ఆక్రమించాడు. గుజరాత్ పాలకుడు బహదూర్‌షా, కున్హాకు మధ్య డయ్యూ ఆధీనానికి సంబంధించి వివాదం ఏర్పడింది.
దీని కారణంగా కున్హా బహదూర్‌షాను అరేబియా సముద్రంలో ముంచి చంపాడు.
మార్టిన్ ఆల్‌ఫాన్సో డిసౌజతో కలిసి ఫాదర్ జేవియర్ భారతదేశానికి వచ్చాడు.
1661లో పోర్చుగీసు యువరాణి కాథరిన్ బ్రిగాంజ, బ్రిటీష్ యువరాజు 2వ చార్లెస్ మధ్య వివాహం జరిగింది. ఈ సందర్భంగా పోర్చుగీసు వారు సెయింట్ డేవిడ్ లేదా బాంబేను 2వ చార్లెస్‌కు కట్నంగా ఇచ్చారు.
బ్రిటీష్ ప్రవేశం :
ప్రధాన కేంద్రము - కలకత్తా (ఫోర్ట్ విలియమ్స్)
1599లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని మర్చంట్ అడ్వెంచర్స్ గ్రూప్ అనే సంస్థ స్థాపించింది.
కానీ బ్రిటీష్ రాణి 1వ ఎలిజబెత్ ఈ కంపెనీకి తన అంగీకారమును 1600 డిసెంబర్ 31న తెలియజేసింది.
1600- బ్రిటీష్ నౌక హెక్టార్ సూరత్ చేరుకుంది.
1608- హాకిన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాయబారిగా జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించి సూరత్‌లో ఒక స్థావరమును నిర్మించుట కొరకై అనుమతిని పొందాడు.
1615- బ్రిటీష్ రాజు 1వ జేమ్స్ తన రాయబారిగా సర్ థామస్‌రోను జహంగీర్ ఆస్టానానికి పంపాడు. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యంలో ఎక్కడైనా సరే వర్తకం కొరకు స్థావరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు జహంగీర్ నుంచి అనుమతిని పొందాడు.
1689- చంద్రగిరి పాలకుడు 3వ వెంకటపతిరాయలు మదరాసు పట్టణాన్ని బ్రిటీష్ అధికారి అయిన ఫ్రాన్సిస్‌దేకు ఇచ్చాడు. మదరాసులో నిర్మించిన కోటను సెయింట్ జార్జి అంటారు.
1657- BEIC జాయింట్ స్టాక్ కంపెనీగా మారింది (చార్జర్ ఆఫ్ క్రామ్‌వెల్ ప్రకారం)
1668- బ్రిటీష్ రాజు 2వ చార్లెస్ సెయింట్ డేవిడ్ లేదా బోంబేను శాశ్వత లీజుకు బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి ఇచ్చివేశాడు.
1698- కాలీకత, సుతనాటి, గోవిందాపూర్ గ్రామాలు బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి ఇవ్వబడ్డాయి. ఈ మూడు గ్రామాలను కలిపి కలకత్తా అంటారు. ఇక్కడ నిర్మించిన కోటను ఫోర్ట్ విలియమ్స్ అంటారు.
1717-మొగలు చక్రవర్తి ఫారూఖ్ సియార్ బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి బంగారు ఫర్మాన్ లేదా ఫ్రీ దస్తక్‌లను ఇచ్చాడు. ఫోర్ట్ విలియమ్స్ అధ్యక్షుడు జాన్‌సుర్మాన్, వైద్యుడు విలియం హామిల్టన్, బ్రిటీష్ అధికారి స్టీఫెన్‌సన్ 1715లో ఫారూఖ్ సియార్ ఆస్థానాన్ని సందర్శించారు. అపుడు ఫారూఖ్ సియార్ ఒక రాచపుండుతో బాధపడుతుందే వాడు. వైద్యుడు హమిల్టన్ ఫారూఖ్ సియార్ యొక్క రాచపుండును నయం చేశాడు.
1717లో ఫారూఖ్ బ్రిటీష్‌కు బంగారు ఫర్మాన్‌ను ఇచ్చాడు.
దీని ప్రకారం బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సంవత్సరానికి రూ.3 వేలు చెల్లించి బెంగాల్, గుజరాత్, దక్కన్(హైదరాబాద్)లలో ఎటువంటి సుంకములు చెల్లించకుండా యథేచ్చగా వర్తకం చేసుకోవచ్చు. దీన్ని 'Magna Carta of the Company' అంటారు.
బ్రిటీష్ స్థావరాలు:
సూరత్ - 1608
మచిలీపట్నం - 1611 (దక్షిణ భారతదేశంలో బ్రిటీష్ వారి మొట్టమొదటి స్థావరం & తూర్పు తీరంలో బ్రిటీష్ మొదటి స్థావరం)
సూరత్ - 1613 (బ్రిటీష్ కెప్టెన్ బెస్ట్ పోర్చుగీసు వారిని స్వాహివి యుద్ధంలో ఓడించాడు. దీంతో జహంగీర్ సూరత్ వద్ద శాశ్వత స్థావర నిర్మాణానికి బ్రిటీష్‌కు అనుమతి ఇచ్చాడు.
పులికాట్ - 1621
బాలాసోర్ - 1633(తూర్పు భారతదేశంలో బ్రిటీష్ వారి మొట్టమొదటి స్థావరం)
మద్రాసు - 1639-1640
హుగ్లీ - 1651
సుతనాటి. - 1691 (దీనిని జాబ్‌చార్నోక్ నిర్మించాడు. దీనిచుట్టూ నిర్మించబడిన కోటనే ఫోర్ట్ విలియమ్స్ అంటారు).