ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, దయానంద సరస్వతి(ఇండియన్ హిస్టరీ)
ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ బిరుదులు - పండిత్, ఛాంపియన్ ఆఫ్ ఉమెన్ రిఫార్మర్ ఇన్ ఇండియా, విద్యాసాగర్
ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్:
బిరుదులు - పండిత్, ఛాంపియన్ ఆఫ్ ఉమెన్ రిఫార్మర్ ఇన్ ఇండియా, విద్యాసాగర్
వార్తాపత్రిక - సోమ్‌ప్రకాష్ (బెంగాలీ భాషలో)
పుస్తకం - బహు వివాహ్ బెంగాలీ ప్రాథమిక వాచకం
సంస్థ - బెథూన్ పాఠశాల
దీనిని 1849లో కలకత్తాలో బాలికల విద్య కొరకు స్థాపించాడు.
విద్యాసాగర్ అత్యధికంగా వితంతు పునర్వివాహం కొరకు పోరాటం చేశాడు.
ఇతని పోరాట ఫలితంగా అప్పటి గవర్నర్ జనరల్ డల్హౌసీ 1856లో వితంతు పునర్వివాహ చట్టం ప్రవేశపెట్టాడు.
1856 డిసెంబర్ 7న విద్యాసాగర్ మొట్టమొదటి అధికారిక వితంతు పునర్వివాహమును కలకత్తాలో జరిపించాడు.
దక్షిణ భారతదేశంలో వీరేశలింగం 1881 డిసెంబర్ 11న మొదటి అధికారిక వితంతు పునర్వివాహంను రాజమండ్రిలో జరిపించాడు.
బాల్య వివాహాలను, బహు భార్యత్వమును ఖండించాడు.
ఇతను చిన్నప్పటి నుండి అనేక సమస్యలను ఎదుర్కొని విద్యాభ్యాసం చేశాడు.
35 పాఠశాలలకు ఇన్‌స్పెక్టర్‌గా నియమించబడ్డాడు.
ఈ 35 పాఠశాలల్లో 12 పాఠశాలలను తన సొంత ఖర్చుతో నడిపించాడు.
బెంగాల్ సంస్కృత కళాశాలకు ప్రిన్సిపాల్‌గా నియమించబడ్డాడు.
వెనుకబడిన తరగతుల వారిని, మహిళలను విద్యాభ్యాసం కొరకు ఈ కళాశాలకు ఆహ్వానించాడు.
దయానంద సరస్వతి :
అసలు పేరు - మూల శంకర్
బిరుదు : స్వామి
పుస్తకాలు:
- సత్యార్థ ప్రకాష్
- వేద భూమిక
- వేద రహస్య
- వేద భాష్య
సంస్థ - ఆర్యసమాజ్ (1875-బొంబాయి), గో రక్షణ సంఘం (1882)
దయానంద సరస్వతి గుజరాత్‌లోని ఖతియావాడ్‌లో జన్మించినప్పటికీ తన ఉద్యమాన్ని పంజాబ్, లాహోర్‌లలో చేశాడు.
ఇతను చిన్నతనం నుంచి విగ్రహారాధనను ఖండించాడు.
ఇతను 12-13 ఏళ్లు పాటు దేశ సంచారం చేశాడు.
శృంగేరిలో పరమానంద సరస్వతి వద్ద వేదాలను పఠించాడు.
మధురలో స్వామి విరజానంద యొక్క శిష్యుడిగా మారాడు.
విరజానంద సలహా మేరకు మూలశంకర్ అనే తన పేరును దయానంద సరస్వతిగా మార్చుకున్నాడు.
హిందూ మతం ప్రచారం లేకపోవడం కారణంగా హిందూ మతంలో అనేక మూఢ విశ్వాసాలు పుట్టుకొచ్చాయని పేర్కొన్నాడు.
హిందూ మతంను ప్రచారం చేయుటకు 1875లో బొంబాయిలో ఆర్య సమాజంను స్థాపించాడు.
తర్వాత లాహోర్, ఇతర ప్రాంతాలలో అనేక శాఖలు ఏర్పాటు చేయబడ్డాయి.
హిందూ మతంను శుద్ధి చేయుటకు హిందూ మతం నుండి వేరొక మతంలో చేరిన హిందువులను తిరిగి హిందూ మతంలో చేర్చించేందుకు ఆర్య సమాజంలో శుద్ధి మరియు సంఘాట/సంఘం అనే ఉద్యమాలు ఆరంభమయ్యాయి.
వీటిని మదన్‌మోహన్ మాలవ్య ఉత్తరప్రదేశ్‌లో, లాలాలజపతిరాయ్ పంజాబ్, లాహోర్‌లలో వ్యాప్తి చేశారు.
దయానంద సరస్వతి మరణానంతరం విద్యాభివృద్ధికి ఆర్య సమాజ్ దయానంద ఆంగ్లో వేదిక్ అనే పాఠశాలలను స్థాపించినది.
దయానంద ఆంగ్లో వేదిక్ పాఠశాలలో వివాదాలు వచ్చి రెండుగా చీలిపోయింది.
1) గురుకుల పాఠశాలలు -హరిద్వార్‌లో గురుదత్త స్థాపించాడు.
2) ఆధునిక పాఠశాలలు - లాహోర్‌లో లాలా హన్సరాజ్ స్థాపించాడు.
దయానంద ఆర్యులు టిబెట్ నుంచి వచ్చారని పేర్కొన్నాడు.
పరిపాలనకు సంబంధించి 'స్వరాజ్య' అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు.
ఆంగ్లేయుల పరిపాలన కంటే స్వపరిపాలన ఉత్తమమైనది అని పేర్కొన్నాడు.
హిందీ జాతీయ భాషగా ప్రకటించబడాలని పేర్కొన్న మొట్టమొదటి వ్యక్తి దయానంద సరస్వతి.