ఇండియన్ పాలిటీ: లోక్ సభ- నిర్మాణం

లోక్‌సభ సభ్యుడికి అర్హతలు: భారతీయ పౌరసత్వం ఉండాలి.

Update: 2023-01-09 16:31 GMT

లోక్‌సభ సభ్యుడికి అర్హతలు:

భారతీయ పౌరసత్వం ఉండాలి.

25 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండకూడదు.

ఆదాయం వచ్చే ప్రభుత్వ పదవిలో ఉండకూడదు.

నేరారోపణ రుజువై ఉండకూడదు.

దివాళా తీసి ఉండకూడదు.

శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి.

దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి.

షరతులు:

పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రంతో పాటు రూ. 25,000 ధరావతు చెల్లించాలి. (ఎస్సీ, ఎస్టీలకు రూ.12,500).

అభ్యర్థి తన ఆస్తులు, అప్పులు, ఇతర వివరాలను తప్పనిసరిగా అఫిడవిట్ రూపంలో తెలియజేయాలి.

పదవీ కాలం:

ప్రకరణ 83(2) ప్రకారం లోక్‌సభ సాధారణ కాల వ్యవధి 5 ఏళ్లు.

జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు ఏడాది వరకు పొడిగించవచ్చు.

జాతీయ అత్యవసర పరిస్థితి రద్దయిన తర్వాత ఆరు నెలల కంటే ఎక్కువ కాలం పొడిగించడానికి వీల్లేదు.

అలాగే రాజకీయ అనిశ్చితి నెలకొన్నప్పుడు ప్రకరణ 85 ప్రకారం 5 ఏళ్ల కంటే ముందే లోక్‌సభను రద్దు చేయొచ్చు.

పార్లమెంట్ - సమావేశాలు:

ప్రకరణ 85 ప్రకారం.. పార్లమెంట్ ఏడాదికి కనీసం రెండు సార్లు సమావేశమవ్వాలి. అయితే, రెండు సమావేశాల మధ్య కాలం ఆరు నెలలకు మించకూడదు. అవసరమైనప్పుడు, ప్రత్యేక పరిస్థితుల్లో మరికొన్ని సమావేశాలు నిర్వహించవచ్చు. గరిష్ట సమావేశాలపై ఎలాంటి పరిమితి లేదు. ప్రస్తుతం పార్లమెంట్ ఏడాదికి మూడు సార్లు సమావేశమవుతుంది.

అవి..

బడ్జెట్ సమావేశం: జనవరి - ఏప్రిల్

వర్షాకాల సమావేశం: జులై - ఆగస్టు

శీతాకాల సమావేశం: నవంబర్-డిసెంబర్

ప్రతి సమావేశాన్ని నిర్దిష్టంగా ఇన్ని రోజులు నిర్వహించాలన్న నియమం లేదు. మూడు సమావేశాలు కలిపి సుమారు 90 నుంచి 110 రోజుల వరకు జరుగుతాయి.

పార్లమెంటు సభ్యుల అనర్హతలు:

పార్లమెంటు సభ్యుల అనర్హత కు సంబంధించిన అంశాలను ప్రకరణ 102(1)లో పేర్కొన్నారు.

కింది సందర్భాల్లో పార్లమెంటు సభ్యుల సభ్యత్వం రద్దవుతుంది.

లాభదాయక పదవుల్లో కొనసాగినప్పుడు

మానసిక స్థిమితం లేదని కోర్టు ధ్రువీకరించినప్పుడు

దివాళా తీసినప్పుడు

భారత పౌరసత్వాన్ని కోల్పోయినప్పుడు

ఎన్నికల్లో అక్రమాలు రుజువైనప్పుడు

ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్ణీత గడువులోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించనప్పుడు

పదవిని దుర్వినియోగపర్చినప్పుడు.

వరకట్నం, సతీ, అస్పృశ్యత చట్టాల కింద శిక్షకు గురైనప్పుడు

పార్టీ ఫిరాయించినా, పార్టీ విప్‌నకు వ్యతిరేకంగా ఓటు వేసినా, పార్టీకి రాజీనామా చేసినా, పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం సభ్యత్వం రద్దవుతుంది.

(ప్రకరణ 102(2))

చివరి కారణం మినహా మిగిలిన అన్ని సందర్భాల్లో కేంద్ర ఎన్నికల సంఘం సలహా మేరకు రాష్ట్రపతి పార్లమెంట్ సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేస్తారు.

సభ్యుల అనర్హత - వివాదాలు (ప్రకరణ-103)

పార్లమెంటు సభ్యుల అనర్హతకు సంబంధించి తుది నిర్ణయం రాష్ట్రపతిదే.

దీనికి సంబంధించి న్యాయస్థానాలు సాధారణంగా జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు.

READ MORE

తెలంగాణ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు

ఇండియన్ పాలిటీ: రాజ్యసభ నిర్మాణం 

Tags:    

Similar News