ఇండియన్ హిస్టరీ: ఆర్యులు(పోటీ పరీక్షల ప్రత్యేకం)

వేదాలను అపౌరుషేయాలు, నిత్య, శృతులు, సంహితాలు అని కూడా అంటారు. వేదము విద్ అనే సంస్కృత భాషా పదం నుంచి ఆవిర్భవించింది.

Update: 2023-03-10 12:05 GMT

వేదాలు:

వేదాలను అపౌరుషేయాలు, నిత్య, శృతులు, సంహితాలు అని కూడా అంటారు. వేదము విద్ అనే సంస్కృత భాషా పదం నుంచి ఆవిర్భవించింది. విద్ అనగా తెలుసుకోవడం అని అర్థం. అపౌరుషేయాలు అనగా మానవుల చేత రచించబడనివి అని అర్థం. వేదాలు 4, సంస్కృత భాషలో రాయబడినవి. వీటిని వ్యాసుడు సంకలనం చేశాడు. ఇతడిని వేదవ్యాసుడు అంటారు.

ఆర్య నాగరికతనే వైదిక నాగరికత అని అంటారు.

ఇది క్రీ.పూ. 1500 - 600 కాలంలో వర్ధిల్లింది.

ఆధారాలు: వేదాలు, నాణెములు, శాసనాలు.

1786లో ఆర్యుల జన్మ స్థానం గురించి సర్ విలియం జోన్స్ ప్రస్తావించాడు.

1784 జనవరి 15న కలకత్తాలో విలియం జోన్స్ ఆసియాటిక్ సొసైటీని స్థాపించారు.

ఆర్యులు నోర్డిక్ జాతికి చెందినవారు. ఆర్య అనే సంస్కృత పదానికి శ్రేష్ఠుడని అర్థం.

బోగజ్‌కాయ్ (కష్టి, మెట్టూరి) శాసనం ఇంద్ర, వరుణ, మిత్ర, నసత్య అనే దేవతల గురించి వివరించింది.

ఆర్యులు భారతదేశంపై పశువుల కోసం, పశుగ్రాసం కోసం దండయాత్ర చేశారు.

గడ్డి మైదానాలపై ఉండే అధికారి వజ్రపతి:

మెలూహ (సప్త సింధు)అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సాంభార అనే సింధు తెగ నాయకుడిని ఓడించి దివదాసకుడు అనే ఆర్య తెగ నాయకుడు సింధు నది పరిసర ప్రాంతాన్ని ఆక్రమించాడు.

దివదాసకుడి అనంతరం త్రిస్యదాసకుడు సింధు ప్రజలపై దండెత్తి అనేక మంది ధన్యులను హత్య చేసాడు.

అందుకే ఇతనిని ధాస్యహత్య అని పేర్కొంటారు.

ఆర్యుల కాలంలో పశువుల కోసం, పశుగ్రాసం కోసం జరిగిన యుద్ధాలను గవిస్థి/గవిసాన/గవ్యవత్ అనేవారు.

ఆర్యుల కాలంలో గోవులను దొంగిలించే వారిని పాణీలు, పాలు పితికే వారిని దుహితి అనేవారు.

గ్రామాల సముదాయాన్ని విశ్ అనేవారు.

వైదిక నాగరికతను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి

1. తొలి వేదకాల నాగరికత (క్రీ.పూ 1500 -క్రీ.పూ 1000)

2. మలి వేదకాల నాగరికత (క్రీ.పూ 1000- క్రీ.శ 600)

ఆర్య నాగరికతను సామాజిక కారణాలు, ఆర్థిక కారణాలు, రాజకీయ కారణాలు, మత కారణాలు అనే నాలుగు అంశాల ఆధారంగా వర్గీకరించారు.

ఆర్య సంస్కృతిని తూర్పు భారతదేశానికి వ్యాప్తి చేసింది వైదేహుడు

దక్షిణ భారతదేశానికి వ్యాప్తి చేసింది అగస్తుడు

భరత వంశం, పురు వంశం వివాహ సంబంధాల ద్వారా ఏకమై నూతనంగా కురు అనే వంశాన్ని స్థాపించాయి.

వేదాలను 2 రాకాలుగా వర్గీకరిస్తారు. అవి 1. కర్మకాండ స్వర్గప్రాప్తికి సంబంధించినది. 2. జనన కాండ శాశ్వతం కానీ మానవ జన్మకు సంబంధించింది.

ప్రతి వేదానికి 4 అనుబంధ గ్రంథాలున్నాయి.

అవి. 1. సంహితాలు 2. అరణ్యకాలు 3. బ్రాహ్మణ కాలు 4. ఉపనిషత్తులు

సంహితాలు: వేదాలలో గల శ్లోకాల సముదాయం. ఉదా. గాయత్రి మంత్రం.

అరణ్యకాలు : గురువులు, విద్యార్థుల మధ్య జరిగే చర్చల సారాంశం.

బ్రాహ్మణకాలు: పద్య రూపంలో ఉండే వేదాలను గద్య రూపంలోకి మార్చే వాటిని బ్రాహ్మణ కాలు అని అంటారు.

1. రుగ్వేదం ఆత్రేయ, కౌశాటక

2. సామవేదం చాందోగ్య

3. యజుర్వేదం శతపథి

4. అధర్వణ వేదం గోపధి

బ్రహ్మణాలన్నింటిలో కెల్లా అత్యంత ప్రాచీనమైనది. పెద్దది, ముఖ్యమైంది శతపథి.

Tags:    

Similar News