ప్రభుత్వ ఉద్యోగార్థుల కోసం పాలిటీలో ముఖ్యమైన ప్రశ్నలు
భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ పరిపాలన నియంత్రణకు ప్రవేశపెట్టిన బ్రిటిష్ చట్టం ఏది
* భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ పరిపాలన నియంత్రణకు ప్రవేశపెట్టిన బ్రిటిష్ చట్టం ఏది?
ans. రెగ్యులేటింగ్ చట్టం -1773
* బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు?
ans. వారన్ హేస్టింగ్స్
* భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి రాజ్యాంగ సభ ఎప్పుడు ఏర్పడింది?
ans. 1946, డిసెంబర్ 6.
* ఏ చట్టం ద్వారా భారతదేశ పరిపాలన వ్యవహారాలు ఈస్టిండియా నుంచి బ్రిటన్ రాణికి వెళ్లాయి.
ans. భారత ప్రభుత్వ చట్టం-1858
* భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ?
ans. 1949 నవంబర్ 26.
* సుప్రీంకోర్టు ఏ కేసు తీర్పులో భాగంగా భారత రాజ్యాంగ పీఠిక రాజ్యాంగంలో భాగమని తీర్పునిచ్చింది.
ans. కేశవానంద భారతి కేసులో
* భారత రాజ్యాంగం పూర్తిగా అమల్లోకి వచ్చిన తేదీ?
ans. 1950 జనవరి 26.
* రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది?
ans. 1946, డిసెంబర్ 9.
* రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎక్కడ జరిగింది?
ans. ఢిల్లీ.
* భారత్‌లో సుప్రీంకోర్టును ఏ చట్టం ప్రకారం ఏర్పాటుచేశారు.?
ans. రెగ్యులేటింగ్ చట్టం -1773.
* ఇప్పటివరకు రాజ్యాంగ పీఠికను ఎన్నిసార్లు సవరించారు?
ans. ఒకసారి
* రాజ్యాంగానికి పీఠిక అనే భావనను ఎక్కడి నుండి గ్రహించారు?
ans. అమెరికా.
* రాజ్యంగ పరిషత్‌లో మహిళలకు ప్రాతినిధ్యం వహించినది ఎవరు?
ans. హంసా మెహతా
* రాజ్యాంగ పరిషత్ జాతీయ జెండాను ఆమోదించిన తేదీ?
ans. 1947, జులై 27.
* భారత రాజ్యాంగ సవరణ గురించి తెలిపే ఆర్టికల్ ఏది?
ans. 368
* రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ గరిష్ట జీవిత కాలం ఎంత?
ans. 6 నెలల 6 వారాలు
* భారత స్వాతంత్య్ర చట్టం 1947 ను ఆమోదించిన వారు ఎవరు?
ans. ఇంగ్లాండ్ పార్లమెంట్.
* ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి.
ans. 3 వ భాగంలో
* భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు బ్రిటన్ ప్రధాని ఎవరు?
ans. క్లెమెంట్ అట్లీ.
* రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ పరిషత్ ఎన్ని కమిటీలను ఏర్పాటు చేసింది.
ans. 22
* వయోజన ఓటు హక్కు పరిమితిని 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించిన సవరణ ఏది?
ans. 61 వ సవరణ
* మహిళలకు తొలిసారిగా ఓటు హక్కును కల్పించిన దేశం ఏది?
ans. న్యూజిలాండ్.