తెలంగాణ చరిత్ర: నిజాం ప్రజల సంఘం (గ్రూప్ -2 స్పెషల్)
హైదరాబాద్‌లో నిజాంకు కృతజ్ఞత తెలియజేయడానికి ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
నిజాం అభినందన సభ
హైదరాబాద్‌లో నిజాంకు కృతజ్ఞత తెలియజేయడానికి ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న ముల్కీ ఉద్యమ నాయకులు
1. పద్మజా నాయుడు
2. లతీఫ్ సయిద్
3. బూర్గుల రామకృష్ణారావు
4. మీర్ హసనోద్దిన్ (మమ్లకత్ ఉర్దూ వార పత్రిక సంపాదకుడు)
5. మంద మూల నరసింహారావు (రమ్యత్ పత్రిక సంపాదకుడు)
6. రాజా ధాండేరాజు
7. మీర్ అక్బర్ అలీ ఖాన్
8. హుమయూన్ మీర్జా
9. నవాజ్ షంషేర్ జంగ్
రాజ్యాంగ సంస్కరణల కమిటీ
1937లో 7వ నిజాం హైదరాబాద్ రాజ్యంలో రాజ్యాంగ సంస్కరణలపై వేసిన కమిటీ అరవముదు అయ్యంగార్ కమిటీ.
1038 లో అనేక రాజ్యాంగ సంస్కరణలను సూచిస్తూ తన నివేదికను సమర్పించింది.
ఈ కమిటీ నివేదికలో ఉద్యోగాలకు సంబంధించి స్థానికులకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
అప్పటి వరకు జారీ చేసిన ఫర్మానాలను చిత్తశుద్ధితో అమలు చేయాలని సూచించింది.
ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కొరకు ప్రత్యేకమైన యంత్రాంగాన్ని రూపొందించాలని తెలిపింది.
ఈ కమిటీ సూచనల ఆధారంగా 1919 ఫర్మానాలోని ఆర్టికల్ 39ను 1945 నుండి పూర్తి స్థాయిలో అమలు చేశారు.
1935 నిజాం ప్రజల సంఘం/నిజాం ముల్కీ లీగ్ ఏర్పాటుకు కారణాలు
ముల్కీ లీగ్ ఉద్యమ నేత సయ్యద్ అబిద్ హసన్ రచించిన పుస్తకం పేరు WITHER HYDERABAD.
దీని ప్రకారం ఉత్తర ప్రదేశ్, పంజాబ్ నుండి వచ్చిన వారిలో ఎక్కువ మంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
రాజపఠానా, మర్వార్ ప్రాంతాల నుండి వచ్చినవారు వడ్డీ వ్యాపారం, ఇతర వాణిజ్య రంగాలలో స్థిరపడ్డారు.
ఉత్తర భారతదేశానికి చెందిన గైర్ ముల్కీలు పరిపాలనా వ్యవహారాలలో ఇతరులను అనుమతించేవారు కాదు.
తమకు తాము ఈ రాజ్యపాలకులమని భావించేవారు.
ఆంధ్రా ప్రాంతం, బొంబాయి, సెంట్రల్ ప్రావిన్సెస్, బేరార్ తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున గైర్ ముల్కీలు వలస వచ్చి హైదరాబాద్ నగరంలో, సంస్థానంలో, వివిధ పట్టణాల్లో స్థిరపడటం.
నాన్ ముల్కీలు తామే అర్హతలు ఉన్న వారమని, బాగా చదువుకున్న వారమని ముల్కీ అభ్యర్థులను ప్రక్కకు పెట్టడం ఈ విషయాల వల్ల స్థానిక యువకుల్లో, అభ్యుదయ వాదులలో, విద్యాధికులలో అసంతృప్తి రగిలిన ఫలితమే ముల్కీ లీగ్ ఏర్పాటు.