కుటుంబం - రకాలు: (సోషియాలజీ గ్రూప్ - 2 స్పెషల్ )
కుటుంబం: కనిష్ఠ కుటుంబం:దంపతులు, వారి బిడ్డల వల్ల ఏర్పడిన సామాజిక సమూహం
కుటుంబం: కనిష్ఠ కుటుంబం:
దంపతులు, వారి బిడ్డల వల్ల ఏర్పడిన సామాజిక సమూహం.
ఈ కుటుంబంలో పెరిగే పిల్లలు వారి సమాజ ఆచారాన్ని, కట్టుబాట్లను ప్రథమంగా తెలుసు కుంటారు.
2. కాంపోజిట్ ఫ్యామిలి: దంతపుతులు + వారి సంతోషం
సంతానానికి వివాహం అయితే ప్రాథమిక గుణాన్ని కోల్పోయి అది కాంపోజిట్ కుటుంబం గా మారును.
వివాహం తర్వాత పుట్టింట్లో కూతుర్లు ఉండవలెనా? కుమారుడు ఉండవలెనా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
ఈ కుటుంబంలోని సమస్యల సంఖ్య ఎప్పుడు అధికంగా ఉంటుంది.
విస్తృత కుటుంబం:
నివాస స్థల విధానాన్ని అనుసరించి విస్తృత కుటుంబంలోని రకాలు:
నివాస స్థల సూత్రం ప్రకారం:
1. పతి స్థానిక నివాసం
2. పత్ని స్థానిక నివాసం
3. ద్వి స్థానిక నివాసం
4. మాతల స్థానిక నివాసం
విస్తృత కుటుంబ స్వరూపం:
పతి స్థానిక విస్తృత కుటుంబం
పత్ని స్థానిక విస్తృత కుటుంబం
స్థానిక విస్తృత కుటుంబం
మాతల స్థానిక విస్తృత కుటుంబం
విస్తృత కుటుంబానికి 2,3 అంతకన్నా ఎక్కువ తరాల వారు ఉంటారు.
1. ప్రతిస్థాపక విస్తృత కుటుంబం:
1,2 సోదరులు, వారి భార్యలు, వారి అవివాహితులైన కొడుకులు, కూతుర్లు, వివాహితులైన కొడుకుల, వారి భార్యలు, కొడుకుల సంతానం ఉంటారు.
తండ్రి/తండ్రి అన్న కుటుంబానికి పెద్దగా ఉంటారు.
సమస్థ సంపాదన కుటుంబం కోసం ఖర్చు చేస్తారు.
2. పత్ని స్థానిక విస్తృత కుటుంబం:
1,2 అక్కచెల్లులు ఉంటారు. అవివాహితులైన, వివాహితులైన ఆడబిడ్డలు, వారి బిడ్డల బిడ్డలు ఉంటారు.
స్త్రీలలో జేష్ఠురాలిదే అధికారం.
3. ద్వి స్థానిక విస్తృత కుటుంబం:
దంపతులు, వారి కొడుకులలో కొంత మంది, కూతుర్లలో కొంత మంది, వారి మనువలలో కొంత మంది. మనువరాలు సభ్యులుగా ఉంటారు. ఇవి చాలా అరుదు.
జార్జీ పీటర్ ముర్డాక్: 250 సమాజాల్లో 10 సమాజాల్లో మాత్రమే ఇటువంటి కుటుంబాలున్నాయి.
4. మాత స్థానిక విస్తృత కుటుంబం:
దంపతులు +సంతానం, అతని అక్క చెల్లెళ్ల కొడుకులలో చాలా మంది, అతని కూతుర్ని పెండ్లి చేసుకుని వారి సోదరి కొడుకు కలిసి ఒకే నివాసంలో ఉంటారు.
బహు భార్యత్వ కుటుంబం:
చుక్చీ, కిప్సీజీ, లఖోర్, మర్న్గిన్, బైగా, మరిమతనాల అనే గిరిజన తెగల్లో కనబడుతుంది.
లైంగిక సంబంధాల వల్ల ఒకరి భార్యలందరూ సమానమైన హక్కులతో ఉంటారు.
ప్రతీ భార్యకు ప్రత్యేక నివాస స్థలం /అందరూ ఒక గృహంలో కాపురం చేయవచ్చు.
పెద్ద భార్యకు ప్రత్యేక అధికారం, హక్కులు ఉండవచ్చు.
బహు భర్తత్వ కుటుంబం:
ఉదా: ఖాసా, తోడాలు, తియ్యాన్ అనే గిరిజన తెగలు.
1. కేంద్రక కుటుంబం: భార్య, భర్త+అవివాహిత పిల్లలు
2. ప్రకార్య ఉమ్మడి కుటుంబం :
రక్త సంబంధం ఉన్న 2 కుటుంబాలు, విడివిడిగా ఉన్నప్పటికీ ఒకే ఉమ్మడి అధికారం కింద కార్యకలాపాలు సాగిస్తారు.
3. ప్రకార్య, గణనీయ ఉమ్మడి కుటుంబం:
ఆస్తి విషయంలో ఉమ్మడిగా
4. ఉపాంత ఉమ్మడి కుటుంబం: రెండు తరాల కుటుంబ సభ్యులు.
5. సంప్రదాయ ఉమ్మడి కుటుంబం: 2,3 తరాల వారు.
వంశాను క్రమం అనుసరించి:
1. పితృ వంశీయ కుటుంబం:
తండ్రిని మూల జనకుడిగా పరిగణించి, తన సంతానానికి తండ్రి బంధువులతో పొత్తు పెట్టుకుని, తండ్రినే వంశకర్తగా ఉంటారు.
2. మాతృ వంశీయకు : తల్లి వంశకర్తగా
3. ద్వంద్వ వంశానుక్రమం: ఒక వ్యక్తి తన మాతృవర్గం తోను, పితృ వర్గంతోను పొత్తు కుదుర్చుకుని, రెండు పక్షాల వారిని మూలపురుషులుగా గ్రహించే కుటుంబం.
1. సహజీవనం:
వివాహం చేసుకోకుండా కలిసి జీవించడం.
2. డింక్ కుటుంబాలు: ఆర్థిక భద్రత ఉన్న కొందరు వివాహితులు, ఉద్యగాలు చేసే దంపతులు సంతానాన్ని వద్దనుకుంటారు.
3. కిబ్బట్జ్ కుటుంబ వ్యవస్థ:
పిల్లలు తల్లి దండ్రులకు దూరంగా పిల్లల గృహంలో నివసించడం. ఇజ్రాయెల్ దేశంలో ఉంది.
4. జన్మప్రాస్త: వ్యక్తి తాను జన్మించిన కుటుంబంలో సభ్యుడిగా
5. ధ్యాంతి: ఖాసా తెగ స్థ్రీని పుట్టింట్లో పిలిచే విధానం
6. ర్యాంతి: ఖాసా తెగ స్త్రీని అత్తవారింట్లో
7. గోస్ట్ మ్యారేజ్: అధ్యయనం చేసినది: న్యూయెర్లు, ఇవాన్స్ ఫ్రిచర్డ్.
8. ఈంగ్: ఖాసీ తెగలోని కుటుంబం పేరు.
9. నంబూద్రి సమూహంలోని కుటుంబం : ఇల్లోమ్
10: స్త్రీలను పరస్పరం మార్చుకునే లక్షణం: బర్మాలోని కచ్చన్ కొండ ప్రాంతాలు
సిద్ధాంతాలు:
1. స్వైర వివాహ కుటుంబ సిద్ధాంతం: దీనిని ప్రతిపాదించినది - ప్లీస్
2. పితృవంశీయ కుటుంబ సిద్ధాంతం: అరిస్టాటిల్, ప్లేటో, హన్రీమెయిన్ ప్రతిపాదించారు.
3. మాతృ వంశీయ కుటుంబ సిద్ధాంతం: బ్రిఫాల్టిస్ ప్రతిపాదించారు.
4. పరిణామక్రమ సిద్ధాంతం: మోర్గాన్ ప్రతిపాదించారు.
5. ఏక పత్ని కుటుంబ సిద్ధాంతం: వెస్టర్ మార్క్
6. బహుళ కారక కుటుంబ సిద్దాంతం: మైకేవర్, రాల్ఫ్ లింటన్.
- వట్టిపల్లి శంకర్ రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ