దివ్యజ్ఞాన సమాజం(ఇండియన్ హిస్టరీ): పోటీ పరీక్షల ప్రత్యేకం
దివ్యజ్ఞాన సమాజంను 1875లో హెచ్.పి.బ్లాపట్స్కి, హెచ్.ఎస్. ఆల్కాట్ లు అమెరికాలోని న్యూయార్క్‌లో స్థాపించారు
దివ్యజ్ఞాన సమాజం:
దివ్యజ్ఞాన సమాజంను 1875లో హెచ్.పి.బ్లాపట్స్కి, హెచ్.ఎస్. ఆల్కాట్ లు అమెరికాలోని న్యూయార్క్‌లో స్థాపించారు.
దీనిని ప్రధానంగా మూడు ఉద్ధేశాలతో స్థాపించారు
1) విశ్వమానవ సౌభ్రాతృత్వం
2) అన్ని మతాల అంతిమ లక్ష్యం మోక్షం. ఈ మతాల తత్వంను తెలుసుకొనుట కొరకు వాటిని అధ్యయనం చేయాలి.
3) ప్రకృతిలో, మానవుని లోపల ఉండే అంతర్గత శక్తులను పరిశోధన చేయాలి.
అనిబిసెంట్ వార్తాపత్రికలు - న్యూఇండియా, కామన్‌వీల్
అనిబిసెంట్ అసలు పేరు - అనీవుడ్
ఈమె ఐర్లాండ్‌కు చెందిన మహిళ
దివ్యజ్ఞాన సమాజం ప్రధాన లక్ష్యం 'మానవసేవ'. ప్రాచీన మతాలైన హిందూ మతం, బౌద్ధ మతం, జుడాయిజం మతాల సమ్మేళనం కొరకు ఈ సమాజం ప్రయత్నించింది.
1879లో దీని ప్రధాన కేంద్రం బొంబాయికి మార్చబడింది.
బొంబాయిలో ఖర్చులు అధికంగా ఉండడం వల్ల ప్రధాన కేంద్రం మద్రాస్ దగ్గర అడయార్‌కు మార్చబడింది.
హెచ్.పి.బ్లాపట్స్కి మరణానంతరం కల్నల్ హెచ్.ఎస్. ఆల్మాట్ దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షుడు అయ్యాడు.
1889లో హెచ్.పి.బ్లాపట్స్కి యొక్క “రహస్య సిద్ధాంతం” అనే వ్యాసంను చదివి, అనిబిసెంట్ ప్రభావితమై దివ్యజ్ఞాన సమాజంలో చేరింది.
1907లో అనిబిసెంట్ దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షురాలు అయింది.
ఈమె వితంతు వివాహాలను. ప్రోత్సహించింది.
అనిబిసెంట్ మద్రాస్ సంఘ సంస్కరణ సభను ఏర్పాటు చేసింది.
అనిబిసెంట్ భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదించింది.
విద్యాభివృద్ధికై బెనారస్ హిందూ పాఠశాలను, మదనపల్లిలో జాతీయ కళాశాలను(బి.టి. కళాశాల), ఆర్కాట్‌లో ఆర్కాట్ పంచమ పాఠశాలను స్టాపించినది.
అనిబిసెంట్ 1914లో అఖిల భారత కాంగ్రెస్‌లో చేరింది.
1916లో ఐర్లాండ్ తరహాలో భారతదేశంలో హోంరూల్ ఉద్యమాన్ని మద్రాస్ నుండి ప్రారంభించింది.
తిలక్ హోంరూల్ లీగ్ ఉద్యమం అనిబిసెంట్ ఆల్ ఇండియా హోంరూల్ ఉద్యమంలో విలీనం అయినది.
ఆల్ ఇండియా హోంరూల్ లీగ్ మొట్టమొదటి కార్యదర్శి -జార్జ్ అరుండేల్.
1916లో లక్నోలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మితవాదులు, అతివాదులు, ముస్లింలీగ్ విలీనం అవడంలో తిలక్, జిన్నాలతో పాటు అనిబిసెంట్ కూడా కీలకపాత్ర పోషించింది.
1917లో కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో అఖిల భారత కాంగ్రెస్‌కు అనిబిసెంట్ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైనది.
లూసిఫేర్ లేదా లిజాఫేర్ జర్నల్‌కు ఈమె ఎడిటర్.
అనిబెసెంట్ స్థాపించిన బెనారస్ హిందూ పాఠశాల మదన్మోహన్ మాలవ్యచే బెనారన్ హిందూ విశ్వవిద్యాలయంగా మార్చబడినది.
అనిబిసెంట్ యొక్క దత్తత కుమారుడు - జిడ్డు కృష్ణమూర్తి
జిడ్డు కృష్ణమూర్తి సిద్ధాంతం - గురువు లేకుండా సత్యంను సాధించుట
జిడ్డు కృష్ణమూర్తి పుస్తకం- At the feet of the master
బంకించంద్ర ఛటర్జీ :
బంకించంద్ర ఛటర్జీ తన “ఆనంద్ మఠ్(1882)” ద్వారా భారతదేశ గొప్పతనాన్ని తెలియజేశారు.
ఈ పుస్తకంలోనే భారత జాతీయ గేయం “వందేమాతరం” సంస్కృతంలో రచించబడింది.
వందేమాతరంను ఆంగ్లంలోకి అనువదించినవారు - అరబిందో ఘోష్ (1909 కర్మయోగిన్ అనే గ్రంథంలో)
ఆనందమఠ్‌లో సన్యాసి తిరుగుబాటు గురించి పేర్కొనబడినది.
ఇతను 'బంగదర్శన్'” అనే జర్నల్‌ను కటక్ నుంచి ప్రచురించాడు.
భారతదేశ సంస్కృతిని ప్రజలకు తెలియజేశాడు.