సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవ యుగం: ఇండియన్ హిస్టరీ(గ్రూప్ -1, 2 స్పెషల్)

దేవేంద్రనాథ్‌ఠాగూర్‌ : బిరుదు - బ్రహ్మర్షి

Update: 2023-04-25 16:44 GMT

దేవేంద్రనాథ్‌ఠాగూర్‌ :

బిరుదు - బ్రహ్మర్షి

పత్రిక - తత్త్వబోధిని

సంస్థ - తత్వబోధిని సభ (1839)

రాజారామ్మోహన్‌రాయ్‌ ప్రధాన శిష్యుల్లో దేవేంద్రనాథ్‌ఠాగూర్ కూడా ఒకరు.

రాజారామ్మోహన్‌రాయ్‌ మరణానంతరం దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ బ్రహ్మసమాజ్‌కు నేతృత్వం వహించాడు.

బెంగాల్‌లో అనేక బెంగాలీ పాఠశాలలను ఏర్పాటు చేశాడు.

కేశవచంద్రసేన్‌ :

వార్తాపత్రికలు - సులభ్‌ సమాచార్‌, న్యూ డిస్పెన్సేషన్

సంస్థలు -ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్, నవవిధాన్‌సభ , సంఘత్‌సభ

కేశవ్‌చంద్రసేన్‌ వితంతు వివాహాలను ప్రోత్సహించాడు.

పురోహితుల ఆధిపత్యం, బాల్య వివాహాలను ఖండించాడు.

బ్రహ్మసమాజ్‌లో చేరి అనేక వితంతు వివాహాలను జరిపించాడు.

బ్రహ్మసమాజంలో దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌తో కేశవ చంద్రసేన్‌కు వివాదాలు ఏర్పడుటచే బ్రహ్మసమాజ్‌ రెండుగా చీలిపోయింది (1866).

1) ఆది బ్రహ్మసమాజ్‌ (దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ నేతృత్వంలో)

2) బ్రహ్మసమాజ్‌ ఆఫ్‌ ఇండియా (కేశవ చంద్రసేన్‌ నేతృత్వంలో)

1878లో కేశవ చంద్రసేన్‌ తన 13 సంవత్సరాల కూతురిని కూచ్‌బీవోర్‌ రాజుకు ఇచ్చి వివాహం జరిపించాడు.

ఈ వివాహంలో పురోహితులను ఆహ్వానించి సంప్రదాయబద్దంగా వివాహం జరిపించాడు.

దీని కారణంగా బ్రహ్మసమాజ్‌ ఆఫ్‌ ఇండియా రెండుగా చీలిపోయింది.

1) నియో బ్రహ్మసమాజ్‌ (కేశవ చంద్రసేన్‌ నేతృత్వంలో)

2) సాధారణ బ్రహ్మనమాజ్‌ (శివానంద శాస్త్రి, ఆనందమోహన్‌బోస్‌ నేతృత్వంలో)

అంటరానితనం నివారించుటకు సాధారణ బ్రహ్మసమాజ్‌ దాస్‌ ఆశ్రమంను స్థాపించింది.

కేశవ చంద్రసేన్‌ తర్వాత కాలంలో మహిళలకు ఉన్నత విద్య ఉండకూడదని, సమాజంలో పరదా విధానం పూర్తిగా తొలగించకూడదని పేర్కొన్నాడు.

హెన్రీ వివియన్‌ డిరాజియో (1809-31):

బిరుదు - భారతదేశ మొట్టమొదటి జాతీయ కవి

వార్తాపత్రిక - ఈస్ట్‌ ఇండియాన్‌, - హెస్పరెస్‌

ఇతను ఒక గొప్ప కవి. భారతదేశంపై అనేక కవితలను రచించాడు.

బెంగాల్‌లో యువ బెంగాల్‌ ఉద్యమంను ప్రారంభించాడు.

కొన్ని లక్షల మంది బెంగాలీలు ఈ ఉద్యమంలో చేరి బెంగాల్‌ సంస్కృతిని వ్యాప్తి చేశారు.

సురేంద్రనాథ్‌ బెనర్జీ డిరాజియాను బెంగాల్‌ సంస్కృతిని వ్యాప్తి చేసినందుకుగాను వారిని అత్యధికంగా కొనియాడాడు.

1881లో తన హేతుబద్ధత కారణంగా బెంగాల్‌ హిందూ కళాశాల నుంచి తొలగించబడ్డాడు.

అదే సంవత్సరంలో కలరాతో మరణించాడు.

ఇతని ముఖ్య శిష్యుడు - ఖాసీ ప్రసాద్‌ ఘోష్‌

Tags:    

Similar News