2వ, 3వ ఆంగ్లో- కర్ణాటక యుద్ధాలు (ఇండియన్ హిస్టరీ.. గ్రూప్స్ స్పెషల్)

2వ ఆంగ్లో-కర్ణాటక యుద్ధం (1749-1754)

Update: 2023-04-07 17:26 GMT

2వ ఆంగ్లో-కర్ణాటక యుద్ధం (1749-1754):

1748లో హైదరాబాద్‌ నవాబ్‌ నిజాం ఉల్‌ ముల్క్‌ మరణించాడు.

1751లో ముజాఫర్‌జంగ్‌ కడపలోని రాయచోటి లక్కిరెడ్డిపల్లి వద్ద కడప, కర్నూలు నవాబులకు నాయకుడైన హిమ్మత్‌ఖాన్‌చే హత్యకు గురయ్యాడు.

హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెంచి అధికారి బుస్సీ సలాబత్‌ జంగ్‌ను నవాబును చేశాడు.

1752లో సలాబత్‌ జంగ్‌ ఉత్తర సర్కారులను (కొండపల్లి, ఏలూరు, రాజమండ్రి, శ్రీకాకుళం) ఫ్రెంచి వారికి ఇచ్చాడు.

కర్టాటక ‌లో అన్వరుద్దీన్‌ కుమారుడు మహ్మద్‌అలీ తిరుచిరాపల్లిలో బ్రిటీష్‌ అనుమతులు పొందాడు.

తిరుచిరాపల్లిలో బ్రిటీష్‌ సైనికాధికారి అయిన రాబర్ట్‌ క్లైవ్‌ 500 మంది సైనికులతో కర్జాటక రాజధాని అయిన ఆర్కాట్‌పై దాడిచేసి దానిని ఆక్రమించాడు. అందువల్లనే రాబర్ట్‌ క్లైవ్ ను ఆర్కాట్‌ వీరుడు అంటారు.

అనేక చిన్న చిన్న యుద్ధాలలో చందాసాహెబ్‌ మద్దతుదారులు ఓడించబడద్దారు.

చివరకు చందాసాహెబ్‌ పట్టుబడంతో అతనిని ఉరితీశారు.

మహ్మద్‌ అలీ కర్టాటక‌ నవాబు అయ్యాడు. ఇతను “వల్లాజా' అనే బిరుదు పొందాడు. ఇతని వంశాన్ని వల్లజా వంశం అంటారు.

చందాసాహెబ్‌, పరాజయాలను తెలుసుకున్న ఫ్రెంచి ప్రభుత్వం డూప్లేను వెనకకు పిలిపించి గదాహోను ఫ్రెంచి గవర్నరుగా పంపింది.

1754లో గదాహో పాండిచ్చేరి ఒప్పందాన్ని బ్రిటీష్ వారి‌తో కుదుర్చుకుని 2వ ఆంగ్లో కర్ణాటక యుద్ధంను ముగించాడు.




3వ ఆంగ్లో-కర్ణాటక‌ యుద్ధం (1756-1763):

యూరప్‌లోని సప్తవర్ష యుద్ధాల కారణంగా భారతదేశంలో 3వ ఆంగ్లో-కర్టాటక యుద్ధం ప్రారంభమైనది.

ఫ్రెంచి ప్రభుత్వం కౌంట్‌-డీ-లాలీను గవర్నర్‌గా భారతదేశానికి పంపినది.

కౌంట్‌-డి-లాలీ భారతదేశానికి వచ్చి హైదరాబాద్‌లో ఉన్న బుస్సీని పిలిపించి బ్రిటీషు స్థావరాలపై దాడి చేశాడు.

1760లో వందవాసి యుద్ధంలో బ్రిటీష్‌ జనరల్‌ ఐర్‌కూట్‌ ఫ్రెంచి జనరల్‌ కౌంట్‌-డీ-లాలీని, బుస్సీలను ఓడించి ఖైదీలుగా పట్టుకున్నాడు.

ఈ యుద్ధంతో ఫ్రెంచివారు భారతదేశంలో పూర్తిగా తమ ఆధిపత్యాన్ని కోల్పోయారు.

1763లో పారిస్‌ ఒప్పందంతో సప్తవర్ష యుద్దాలు యూరప్‌లో అంతమయ్యాయి.

దీని ప్రకారం భారతదేశంలో కూడా 3వ ఆంగ్లో కర్ణాటక యుద్ధం అంతమైంది. ఫ్రెంచివారు పాండిచ్చేరికి పరిమితమైనారు.

పాండిచ్చేరి అనగా 4 ప్రాంతాలు

1. పాండిచ్చేరి

2. కరైకల్‌

3. యానం

4. మాహే

Tags:    

Similar News