విద్యార్థుల పట్ల అంత క్రూరంగా ప్రవర్తించకూడదు.. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి
దిశ, రాయలసీమ: అనంతపురం జిల్లాలోని ఎస్ఎస్‌బీఎన్ ఎయిడెడ్ కాలేజీ వద్ద నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ ఝులిపించడంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం అమానుషమన్నారు. పోలీసులు విద్యార్థుల పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించి ఉండకూడదని సూచించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. పోలీసులు కూడా విద్యార్థి దశ నుండి వచ్చినవారే అన్న విషయం గుర్తుంచుకోవాలని […]
దిశ, రాయలసీమ: అనంతపురం జిల్లాలోని ఎస్ఎస్‌బీఎన్ ఎయిడెడ్ కాలేజీ వద్ద నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ ఝులిపించడంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం అమానుషమన్నారు. పోలీసులు విద్యార్థుల పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించి ఉండకూడదని సూచించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.
పోలీసులు కూడా విద్యార్థి దశ నుండి వచ్చినవారే అన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల నష్టపోయే వారిలో పోలీసు వారి పిల్లలు కూడా ఉండొచ్చని ఈ విషయాన్ని వారు గమనించాలని సూచించారు. ఇది పిల్లల భవిష్యత్తుకి సంబంధించినదని.. పార్టీలకు అతీతంగా నాయకులు స్పందించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి వీడియోలో విజ్ఞప్తి చేశారు.