SO నిర్లక్ష్యం.. ధర్నాకు దిగిన కస్తూర్బా పాఠశాల విద్యార్థులు
దిశ, మద్దిరాల: మద్దిరాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో కనీస వసతులు కల్పించడం లేదు అని విద్యార్థులు పాఠశాల ముందు ధర్నాకు దిగారు. గత కొన్ని రోజులుగా మెనూ ప్రకారం ఆహారం పెట్టడం లేదని విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు తక్షణమే ఉన్నత అధికారులు స్పందించాలని ఆందోళన చేపట్టారు. దీంతో ఆర్డీవో రాజేంద్రకుమార్ చొరవ తీసుకుని విద్యార్థులకు నచ్చజెప్పి తక్షణమే మౌలిక వసతులు కల్పిస్తామని […]
దిశ, మద్దిరాల: మద్దిరాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో కనీస వసతులు కల్పించడం లేదు అని విద్యార్థులు పాఠశాల ముందు ధర్నాకు దిగారు. గత కొన్ని రోజులుగా మెనూ ప్రకారం ఆహారం పెట్టడం లేదని విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు తక్షణమే ఉన్నత అధికారులు స్పందించాలని ఆందోళన చేపట్టారు. దీంతో ఆర్డీవో రాజేంద్రకుమార్ చొరవ తీసుకుని విద్యార్థులకు నచ్చజెప్పి తక్షణమే మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించుకున్నారు. త్వరలో గదుల ఇబ్బంది లేకుండా సొంత భవనం ఏర్పాటు చేస్తామని ఆర్డీవో హామీ ఇచ్చారు. ఆయన SO తేజశ్రీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవో వెంట తహసీల్దార్, గ్రామ సర్పంచ్ కాతూన్ రజాక్, ఆర్ఐలు రమణ రావు, బాబా తదితరులు ఉన్నారు.
పాఠశాలను పరిశీలించిన డీఈవో అశోక్ కుమార్..
మద్దిరాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల బాలికలు గురువారం ఆందోళన చేపట్టడంతో డీఈఓ అశోక్ కుమార్ సాయంత్రం పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల బాలికలతో మాట్లాడి పాఠశాలలో నెలకొన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.