ఎట్టకేలకు స్వస్థలాలకు..

దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్ కారణంగా ఏపీలోని నంద్యాలలో చిక్కుకున్న తెలంగాణకు చెందిన 650 మంది విద్యార్థులు ఎట్టకేలకు స్వస్థలాలకు చేరుకున్నారు. పొరుగు రాష్ట్రంలో చిక్కుకుని వారు ఎదుర్కొంటున్నఇబ్బందులను మాజీ ఎంపీ కవిత‌కు ట్విట్టర్‌ ద్వారా తెలియజేయగా వెంటనే స్పందించారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల అధికారులతో మాట్లాడి తన సొంత ఖర్చులతో 21 బస్సుల్లో విద్యార్థులను స్వస్థలాలకు చేరే విధంగా కృషి చేశారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 80 మంది విద్యార్థులు మంగళవారం ఉదయం రెండు […]

Update: 2020-05-05 00:47 GMT

దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్ కారణంగా ఏపీలోని నంద్యాలలో చిక్కుకున్న తెలంగాణకు చెందిన 650 మంది విద్యార్థులు ఎట్టకేలకు స్వస్థలాలకు చేరుకున్నారు. పొరుగు రాష్ట్రంలో చిక్కుకుని వారు ఎదుర్కొంటున్నఇబ్బందులను మాజీ ఎంపీ కవిత‌కు ట్విట్టర్‌ ద్వారా తెలియజేయగా వెంటనే స్పందించారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల అధికారులతో మాట్లాడి తన సొంత ఖర్చులతో 21 బస్సుల్లో విద్యార్థులను స్వస్థలాలకు చేరే విధంగా కృషి చేశారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 80 మంది విద్యార్థులు మంగళవారం ఉదయం రెండు బస్సుల్లో పట్టణానికి చేరుకున్నారు. విద్యార్థులకు జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావ్, జాగృతి అధ్యక్షుడు అవంతి రావ్, నూడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మేయర్ నీతూ కిరణ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు కవితకు ధన్యవాదాలు తెలిపారు.

Tags: students, nizamabad, nandyal, lock down

Tags:    

Similar News