బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై ఓయూ పీఎస్‌లో ఫిర్యాదు
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష, సామాజిక విద్యార్థి సంఘాలు, పరిశోధన విద్యార్థులు ఓయూ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా ఓయూ గేట్లను విరగ్గొట్టి, కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వందల మంది అనుచరులతో యూనివర్సిటీలోకి చొరబడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యునివర్సిటీ ఇప్పటికీ ప్రారంభం కాలేదని, బయటి వ్యక్తులు ఎవరూ రావద్దని నిబంధనలు ఉన్నా, స్వయంగా ఎంపీగా ఉండి నిబంధనలు ఉల్లంఘించి ఇలాంటి దుర్మార్గమైన […]
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష, సామాజిక విద్యార్థి సంఘాలు, పరిశోధన విద్యార్థులు ఓయూ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా ఓయూ గేట్లను విరగ్గొట్టి, కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వందల మంది అనుచరులతో యూనివర్సిటీలోకి చొరబడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యునివర్సిటీ ఇప్పటికీ ప్రారంభం కాలేదని, బయటి వ్యక్తులు ఎవరూ రావద్దని నిబంధనలు ఉన్నా, స్వయంగా ఎంపీగా ఉండి నిబంధనలు ఉల్లంఘించి ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడటం ఏమిటని విద్యార్థులు ప్రశ్నించారు. యూనివర్సిటీలో మతపరమైన అంశాలు మాట్లాడి విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, చిల్లర రాజకీయాలకు పాల్పడిన తేజస్వీ సూర్యను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు అర్ఎల్.మూర్తి, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్, ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవి నాయక్, విద్యార్థులు, కరణ్, శ్రీకాంత్ ఉన్నారు.