మంత్రి ఎర్రబెల్లికి గట్టి షాక్.. కొంపముంచిన ‘ఊపుతున్నావ్’ వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్ : మహిళా ఎంపీడీవోపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మరోషాక్ తగిలింది. ఆయనపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బక్క జడ్సన్ జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మాజీకి ఫిర్యాదు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో శుక్రవారం జరిగిన పల్లెప్రగతి గ్రామ సభలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి.. మహిళా ఎంపీడీవోతో అసభ్యకరంగా ‘‘ఎంపీడీవో గారు.. మీరు బాగానే ఊపుతున్నారు. కానీ ఈమె […]
దిశ, వెబ్‌డెస్క్ : మహిళా ఎంపీడీవోపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మరోషాక్ తగిలింది. ఆయనపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బక్క జడ్సన్ జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మాజీకి ఫిర్యాదు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో శుక్రవారం జరిగిన పల్లెప్రగతి గ్రామ సభలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి.. మహిళా ఎంపీడీవోతో అసభ్యకరంగా ‘‘ఎంపీడీవో గారు.. మీరు బాగానే ఊపుతున్నారు. కానీ ఈమె ఇక్కడ ఊపడం లేదు’’ అని అనుచితంగా మాట్లాడారు. దీనిపై ‘‘దిశ’’ వెబ్‌సైట్‌లో కథనం ప్రచురితమై వైరల్‌గా మారింది.
మంత్రి వ్యాఖ్యలపై మండిపడిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బక్క జడ్సన్.. వెంటనే ‘‘దిశ’’ వెబ్‌సైట్ లింక్‌ను జత చేస్తూ ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖాశర్మాజీకి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆ ట్వీట్‌ను తెలంగాణ సీఎంవో, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోపాటు మరి కొందరికి ట్యాగ్ చేశారు. మంత్రి ఎర్రబెల్లి ఘటన మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణం ఘటనను గుర్తు చేస్తోందని బక్క జడ్సన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామ సభలో ఉన్న నాయకులు, అధికారులు సైతం మంత్రి వ్యాఖ్యలను ఖండించకపోగా.. నవ్వులు చిందించారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా అధికారి అనికూడా చూడకుండా, ఆమె పరువుకు భంగం కలిగేలా గ్రామసభలో అనుచిత వ్యాఖ్యాలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై చర్యలు తీసుకోవాలని బక్క జడ్సన్ కోరారు.
Complaint to @NCWIndia on @TelanganaCMO Minister @DayakarRao2019 for humiliating Woman officer MPDO Pallavi in Grama Sabha at Kamalapur, warangal.https://t.co/iXTJYLORrc. @INCIndia @MahilaCongress @TelanganaPMC @sushmitadevinc @manickamtagore @revanth_anumula @CilarapuDamodar pic.twitter.com/t1d2WaukKZ
— judson bakka, బక్క జడ్సన్ – Wear Mask (@zson_bakka) July 9, 2021