ప్రజలు రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు
దిశ, మేడ్చల్: ప్రజలు రోడ్లపైకి అనవసరంగా వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ పద్మజ హెచ్చరించారు. ప్రజలు, వాహనాలు రోడ్లపైకి వస్తున్న క్రమంలో గండిమైసమ్మ చౌరస్తా వద్ద ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం ఈనెల 31వరకు కర్ఫ్యూను విధించిందని, ప్రజలందరూ దీనికి సహకరించాలని కోరారు. పలు చౌరస్తాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. పలువురికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇండ్లకే పరిమితం కావాలని సూచించారు. ఆమె వెంట సీఐ వెంకటేశ్, దుండిగల్ పోలీసులు సిబ్బంది తదితరులు […]
దిశ, మేడ్చల్: ప్రజలు రోడ్లపైకి అనవసరంగా వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ పద్మజ హెచ్చరించారు. ప్రజలు, వాహనాలు రోడ్లపైకి వస్తున్న క్రమంలో గండిమైసమ్మ చౌరస్తా వద్ద ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం ఈనెల 31వరకు కర్ఫ్యూను విధించిందని, ప్రజలందరూ దీనికి సహకరించాలని కోరారు. పలు చౌరస్తాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. పలువురికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇండ్లకే పరిమితం కావాలని సూచించారు. ఆమె వెంట సీఐ వెంకటేశ్, దుండిగల్ పోలీసులు సిబ్బంది తదితరులు ఉన్నారు.
Tags: Strict action, people, get on the roads, medchal