ఈటల ఇష్యూ.. స్ట్రాపోల్​ సర్వే సంచలనం

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి ఈటల రాజేందర్​ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. భూ వ్యవహారంలో ప్రభుత్వాన్ని ముద్దాయిగా చేస్తూ ఈటల కుటుంబం కోర్టెకెక్కింది. దీనిపై కోర్టు కూడా ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. అయితే ఈటల మాత్రం రాజకీయ వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో ఈటల కొత్త పార్టీ ఊహాగానాలపై సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. స్థానిక సర్వే సంస్థలు కాకుండా… అగ్రరాజ్యం నుంచి దీనిపై పరిశీలన జరుగుతోంది. ఇటీవల హుజురాబాద్​ నుంచి ఎన్ఐఆర్‌లతో […]

Update: 2021-05-06 07:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి ఈటల రాజేందర్​ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. భూ వ్యవహారంలో ప్రభుత్వాన్ని ముద్దాయిగా చేస్తూ ఈటల కుటుంబం కోర్టెకెక్కింది. దీనిపై కోర్టు కూడా ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. అయితే ఈటల మాత్రం రాజకీయ వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో ఈటల కొత్త పార్టీ ఊహాగానాలపై సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. స్థానిక సర్వే సంస్థలు కాకుండా… అగ్రరాజ్యం నుంచి దీనిపై పరిశీలన జరుగుతోంది. ఇటీవల హుజురాబాద్​ నుంచి ఎన్ఐఆర్‌లతో జూమ్​ మీటింగ్‌లో మాట్లాడిన ఈటలకు కొత్త పార్టీని సూచించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల్లోనే కొత్త పార్టీపై అమెరికాకు చెందిన ప్రముఖ సర్వే సంస్థ స్ట్రాపోల్​ ఆన్‌లైన్​ ఓటింగ్‌ను మొదలు పెట్టింది. ఈ నెల 5 నుంచి మూడు నెలల పాటు ఆన్​లైన్​సర్వేను ప్రారంభించింది.

సొంత పార్టీకే ప్రియార్టీ

స్ట్రాపోల్​ సర్వేలో గురువారం సాయంత్రం నాటికి దాదాపు 5 వేల మంది ఓటింగ్​లో పాల్గొన్నారు. ఈ ఓటింగ్​లో ముందుగా టీఆర్‌ఎస్‌ను వీడిపోవాలంటూ ప్రధానంగా సూచిస్తున్నారు. కొత్త పార్టీకి మద్దతుగా 41.15 శాతం మంది ఓటేశారు. బీజేపీలోకి వెళ్లాలని 35.60 శాతం, కాంగ్రెస్​లో చేరాలని 15.51 శాతం మంది ఓటేయగా… టీఆర్‌ఎస్‌లోనే కొనసాగాలని 7.74 శాతం మంది ఓట్లేశారు. ఈ లెక్క ప్రకారం సొంత పార్టీకే మొగ్గు చూపుతున్నారు. ఈ ఆన్​లైన్​ఓటింగ్​ రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్​ను స్వీకరిస్తోంది. మొత్తం మూడు నెలల పాటు ఆన్​లైన్​ఓటింగ్‌ను అందుబాటులో ఉంచుతున్నట్లు స్ట్రాపోల్​ ప్రకటించింది.

ఎన్‌ఐఆర్‌లతో మీటింగ్​తర్వాత రంగంలోకి..

మాజీ మంత్రి ఈటల రాజేందర్​ మూడు రోజుల కిందట హుజురాబాద్​ నుంచి ఎన్ఐఆర్​లతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు ఎన్ఆర్ఐలు అండగా ఉంటామని ప్రకటించారు. అయితే కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని, టీఆర్ఎస్ దూరం పెట్టినవారు, వ్యతిరేకులను కలుపుకోవాలంటూ, బహుజన నినాదం ఉండాలంటూ ఈటలకు సూచించారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటూ ఈటల పేర్కొన్నారు.

అయితే ఎన్ఐఆర్​లతో సమావేశం అనంతరం నుంచి ఈ ఆన్​లైన్​ ఓటింగ్‌కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈటల వర్గీయుల్లోని కొంతమంది, ఎన్ఆర్ఐలు పలువురు కలిసి స్ట్రాపోల్​తో ఒప్పందం చేసుకుని ఈ సర్వే చేపట్టుతున్నట్లు సమాచారం. అయితే ఇది ఈటలకు తెలిసే చేస్తున్నారని కూడా పలువురు నేతలు వెల్లడిస్తున్నారు. మొత్తానికైతే కొత్త పార్టీ ఏర్పాటు అంశంపై ఆన్​లైన్​ ఓటింగ్​ మొదలైంది.

Tags:    

Similar News