ఆమెను సంతృప్తి పర్చడం కోసం 5 రోజులు స్త్రీలు నగ్నంగా.. పురుషులు ఏమో..

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం.. సంప్రదాయాలకు, ఆచారాలకు పెట్టింది పేరు. మన దేశంలో ఎన్నో వింత ఆచారాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఒళ్లు గగుర్పొడిచేవి ఉండగా, మరికొన్ని నవ్వు తెప్పించేవి ఉంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఆచారం చూస్తే ఇది నిజమా..? ఇలా కూడా చేస్తారా..? ఇలాంటి ఒక ఆచారం కూడా ఉందా..? అనే అనుమానం రాకతప్పదు. మరి అంతలా ఆశ్చర్యానికి గురిచేసిన ఆ ఆచారం ఏంటి అంటే మహిళలు నగ్నంగా ఐదు రోజులు  దీక్ష చేపట్టడం.. ఏంటి.. […]

Update: 2021-10-18 02:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం.. సంప్రదాయాలకు, ఆచారాలకు పెట్టింది పేరు. మన దేశంలో ఎన్నో వింత ఆచారాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఒళ్లు గగుర్పొడిచేవి ఉండగా, మరికొన్ని నవ్వు తెప్పించేవి ఉంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఆచారం చూస్తే ఇది నిజమా..? ఇలా కూడా చేస్తారా..? ఇలాంటి ఒక ఆచారం కూడా ఉందా..? అనే అనుమానం రాకతప్పదు. మరి అంతలా ఆశ్చర్యానికి గురిచేసిన ఆ ఆచారం ఏంటి అంటే మహిళలు నగ్నంగా ఐదు రోజులు దీక్ష చేపట్టడం.. ఏంటి.. నగ్న దీక్ష..? ఇవన్నీ కట్టుకథలు అని తీసిపడేయొచ్చు.. కానీ, దీన్ని నిజంగానే అక్కడి మహిళలు ఇష్టపూర్వకంగానే పాటిస్తున్నారు. ఇందులో ఎలాంటి బలవంతమూ లేదు. ఏ ఒక్కరు అలా ఉండమని వారిని ఆదేశించలేదు. వారంతట వారే ఈ నిర్ణయం తీసుకొని పాటిస్తున్నారు. ఈ విషయంలో వారు ఏమాత్రం రాజీ పడరు. ఎంతో నియమ నిష్టలతో ఈ నగ్న దీక్ష పాటిస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని పిని అనే చిన్న గ్రామం. ఈ ఊరు సముద్ర మట్టానికి 1950 మీటర్ల ఎత్తులో ఉంది. దీని మొత్తం జనాభా 2,593 మంది. ఇక్కడకు తరచూ పర్యాటకులు వస్తూనే ఉంటారు. అలా వచ్చేవారు ఈ ఆచారం గురించి తెలుసుకొని ఆశ్చర్యపోతుంటారు. దాని వెనుక ఉన్న కథను తెలుసుకొని నివ్వెరపోతుంటారు. అదేంటంటే.. పూర్వం ఇక్కడ లాహు ఘోండ్ అనే దేవత ఉండేదట. ఆమె రాక్షసుల్ని చంపి ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చింది. ఆమెను పూజిస్తూ ఏటా ఐదు రోజులపాటూ ఈ నగ్న దీక్షను చేపడుతున్నారు మహిళలు. ఐదు రోజులు జరిగే దీక్షలో మహిళలు బట్టలు వేసుకోరు. నగ్నంగానే తమ పనులను చేస్తారు. వారిని చూసి ఎవ్వరు నవ్వకూడదు. ఒకవేళ అలా నవ్వితే దేవతకు కోపం వస్తుంది అనేది వారి నమ్మకం. అందువల్ల నవ్వకుండా జాగ్రత్త పడతారు. మహిళలతో పాటు మగవారు కూడా ఈ ఐదు రోజులు నియమనిష్టలతో దేవతను పూజిస్తారు. మద్యాన్ని ముట్టరు.. గ్రామానికి ఎవరిని రానివ్వరు.. వారు గ్రామం దాటి బయటికి పోరు.

నగ్నంగా ఎందుకు..?

దేవతను సంతృప్తి పరచాలంటే నైవేద్యం పెట్టొచ్చు, పూజలు చెయ్యొచ్చు, పండ్లు, స్వీట్లూ ఇవ్వొచ్చు కానీ నగ్నంగా ఎందుకు ఉండటం అంటే అందుకు రెండు కారణాలు ఉన్నాయి. పూర్వం రాక్షసులు మహిళలపై అకృత్యాలకు పాల్పడేవారు. వారిని సంహరించడం ద్వారా ఆ దేవత మహిళల మానాన్ని కాపాడటంతో ఆమెకు ఆ విధంగా తమ భక్తిని చాటుకుంటున్నారు. అక్కడి మహిళలు. ఈ ఊరు హిమాలయ పర్వతాల్లోనే ఉంది. అలాంటి చోట బట్టలు లేకుండా నిమిషం ఉండటమే కష్టం. అలాంటిది ఐదు రోజులు నగ్నంగా ఉండటం అనేది కఠినమైన దీక్ష. అలాంటి దీక్ష ద్వారా అమ్మవారి అనుగ్రహం పొందగలం అని స్థానికులు భావిస్తున్నారు.

Tags:    

Similar News