అభిమానుల్ని నిరాశలో ముంచిన టెన్నిస్ అందం
టెన్నిస్‌లో అందగత్తెలెవరు అంటే అన్నా కోర్నికోవా, అనా ఇవనోవిచ్, లారా రోబ్సన్, మరియా షరపోవాల పేర్లు చెబుతారు. యువకుల గుండెల్లో గూడుకట్టుకున్న యువరాణులుగా, టెన్నిస్ అందగత్తెలుగా వీరు నిలిచిపోయారు. కోర్నికోవా అందంతో ఆకట్టుకున్నప్పటికీ ఆటలో అంతంతమాత్రంగానే నిలిచింది. అందంతో పాటు ఆటతో కూడా ఆకట్టుకున్న తార మరియా షరపోవా.. యువకుల కలలరాణిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న షరపోవా.. టెన్నిస్‌కి వీడ్కోలు పలికింది. నిషేదిత ఉత్ప్రేరకము వాడిందన్న ఆరోపణలతో నిషేధం ఎదుర్కొన్న షరపోవా.. మునుపటి ఫాంను అందుకునేందుకు నానా […]
టెన్నిస్‌లో అందగత్తెలెవరు అంటే అన్నా కోర్నికోవా, అనా ఇవనోవిచ్, లారా రోబ్సన్, మరియా షరపోవాల పేర్లు చెబుతారు. యువకుల గుండెల్లో గూడుకట్టుకున్న యువరాణులుగా, టెన్నిస్ అందగత్తెలుగా వీరు నిలిచిపోయారు. కోర్నికోవా అందంతో ఆకట్టుకున్నప్పటికీ ఆటలో అంతంతమాత్రంగానే నిలిచింది. అందంతో పాటు ఆటతో కూడా ఆకట్టుకున్న తార మరియా షరపోవా.. యువకుల కలలరాణిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న షరపోవా.. టెన్నిస్‌కి వీడ్కోలు పలికింది.
నిషేదిత ఉత్ప్రేరకము వాడిందన్న ఆరోపణలతో నిషేధం ఎదుర్కొన్న షరపోవా.. మునుపటి ఫాంను అందుకునేందుకు నానా తంటాలు పడింది. అయినప్పటికీ అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది. అదే సమయంలో వరుస గాయాలు ఆమెను వేధించాయి. దీంతో ఆటనుంచి తప్పుకోవడమే మేలు అని భావించి, భారమైన హృదయంతో టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది.
ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సొంతం చేసుకున్న 32 ఏళ్ల మరియా షరపోవా ఆటకు వీడ్కోలు పలుకుతూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. మనకు తెలిసిన ఒకే జీవితాన్ని ఎలా వదులుకోవాలి? అంటూ చెమర్చిన కళ్లతో తనను తాను ప్రశ్నించుకుంది. చిన్నప్పటి నుంచి ఆడుతున్న టెన్నిస్ కోర్టుకు దూరంగా ఎలా వెళ్లగమని బాధపడింది. టెన్నిస్ తనకు ఎన్నో మరపురాని అనుభూతులు, చెప్పుకోలేని దుఃఖాలు ఇచ్చిందని పేర్కొంది. 28 ఏళ్లపాటు తనతో నడిచిన ఈ ఆట తనకో కుటుంబాన్ని ఇచ్చిందంటూ భావోద్వేగానికి గురై… చాలా బాధాకరమంటూ గుడ్‌బై చెప్పింది.