ఊళ్లల్లో తిరగలేకపోతున్నాం!
దిశ,న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల దీనస్థితి వర్ణనాతీతం. పేరుకే ప్రజాప్రతినిధులు తప్ప గ్రామాల్లో చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఎన్నికైనా నుంచి నేటికీ ప్రభుత్వం నుంచి చిల్లి గవ్వకూడా నిధులు, అధికారాలు ఇవ్వకపోవడంతో ప్రజల ముందు తాము ఉత్సవ విగ్రహాలుగా ఉండాల్సి వస్తోందంటున్నారు. గ్రామాల్లోకి ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చినప్పుడు వెనక కుర్చీలో కూర్చోవడం తప్ప ఊరికీ తాం చేసేది ఏమీ లేదా! అంటూ ప్రజా ప్రతినిధులు మథనపడుతున్నారు.. రాష్ట్రంలో గత ఏడాది మే నెలలో జరిగిన […]
దిశ,న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల దీనస్థితి వర్ణనాతీతం. పేరుకే ప్రజాప్రతినిధులు తప్ప గ్రామాల్లో చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఎన్నికైనా నుంచి నేటికీ ప్రభుత్వం నుంచి చిల్లి గవ్వకూడా నిధులు, అధికారాలు ఇవ్వకపోవడంతో ప్రజల ముందు తాము ఉత్సవ విగ్రహాలుగా ఉండాల్సి వస్తోందంటున్నారు. గ్రామాల్లోకి ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చినప్పుడు వెనక కుర్చీలో కూర్చోవడం తప్ప ఊరికీ తాం చేసేది ఏమీ లేదా! అంటూ ప్రజా ప్రతినిధులు మథనపడుతున్నారు..
రాష్ట్రంలో గత ఏడాది మే నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 5,817 మంది ఎంపీటీసీలు, 538 మంది జెడ్పీటీసీలు ఎన్నికయ్యారు. పదవి చేపట్టి ఏడాది కాలం దగ్గర పడుతున్నా ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అంటూ నిధులేమీ ఇవ్వకపోవడంతో ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగానే దర్శనమిస్తున్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన చిన్న, చిన్న హామీలు తాగునీటి, డ్రైనేజీ సమస్యలు కూడా తీర్చలేకపోతున్నామని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల ముందు తలెత్తుక తిరగలేకపోతున్న పరిస్థితి దాపురించిందని గోడు వెల్లబోసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎన్నిమార్లు మొరపెట్టుకన్న లాభం లేకుండా పోతోందంటున్నారు. ఎమ్మెల్యేలు , ఎంపీలు గ్రామాల్లోకి వచ్చినప్పుడు వారికి సౌకర్యలు కల్పించి.. వారి వెనక కుర్చీలో కూర్చోవడానికి తప్ప ఇంక ఏమిటికి తమ పదవులు ఉపయోగ పడేలా లేవని ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అసహనానికి గురవుతున్నారు. రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా రావలసిన నిధులు, విధులు అధికారాలు ప్రభుత్వం ఇప్పటి వరకు కల్పించకపోవడంతో స్థానికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వాల్లో గ్రామాల్లో ఉత్పత్తి రంగాల నుంచి వచ్చే ఆదాయన్ని గ్రామాల అభివృద్ధికి కేటాయించేది. ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం గ్రామాల అభివృద్ధికి తూట్లు పొడించిదంటున్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను డమ్మీలను చేసిందని వాపోతున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో గ్రామాల్లోని ఉత్పత్తి రంగాలు మైనింగ్, స్టాంపుడ్యూటీ పై వచ్చే ఆదాయాన్ని నేరుగా రాష్ట్ర ఖజానాకు దారి మళ్లించడంతో స్థానిక సంస్థలు నష్టపోతున్నాయన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్ కూడా స్థానిక ప్రజా ప్రతినిధులకు ఇవ్వకుండా ఎమ్మెల్యే చేతుల మీదుగా కల్లెక్టర్ ద్వారా ఇస్తుండడంతో స్థానికంగా తమకు విలువ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను గుర్తించాలి.
ప్రజాప్రతినిధులుగా స్థానిక సమస్యలను గుర్తించాలని ఎంపీటీసీ, జెడ్పీటీసీల సంఘాల నాయకులు సీఎం కేసీఆర్‌కు లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఆర్టికల్ 243జీవో, 11వ షెడ్యూల్ పేర్కొన్న విధంగా 29 అంశాలను రాజ్యాంగబద్ధంగా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి నిధుల కింద ప్రతి ఎంపీటీసీకి ప్రతి ఏటా రూ.10 లక్ష నిధులు కేటాయించాలని కోరుతున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలకు కేటాయించినవే కాకుండా అదనంగా ఎంపీటీసీలకు కూడా నిధులు కేటాయించాలంటున్నారు. సీనరేజ్, స్టాంపు డ్యూటీలపై గ్రామ పంచాయతీ, మండల పరిషత్త్ లకు వచ్చే వాటాను సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
tags: mptc, zptc, found, mlas , ministers , mp , kcr, trs, go’s