అక్కడ రేప్ జరిగే అవకాశమే లేదు : గాంధీ ఘటనపై నివేదిక

దిశ, తెలంగాణ బ్యూరో : గాంధీ ఆసుపత్రి రేప్ ఘటనపై విచారణ కమిటీ డీఎంఈ డాక్టర్ రమేశ్ రెడ్డికి బుధవారం ప్రాథమిక నివేదికను అందజేసింది. బాధితురాలు ఆరోపిస్తున్నట్లు ఆ ప్రదేశాల్లో రేప్ జరిగే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. నిత్యం పేషెంట్లు, అటెండర్లు, స్టాఫ్‌తో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నది. అంతేగాక ఆ చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలతో పాటు, గాంధీలో పనిచేస్తున్న 189 కెమెరాలను పూర్తిగా పరిశీలించామని, […]

Update: 2021-08-18 11:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గాంధీ ఆసుపత్రి రేప్ ఘటనపై విచారణ కమిటీ డీఎంఈ డాక్టర్ రమేశ్ రెడ్డికి బుధవారం ప్రాథమిక నివేదికను అందజేసింది. బాధితురాలు ఆరోపిస్తున్నట్లు ఆ ప్రదేశాల్లో రేప్ జరిగే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. నిత్యం పేషెంట్లు, అటెండర్లు, స్టాఫ్‌తో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నది.

అంతేగాక ఆ చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలతో పాటు, గాంధీలో పనిచేస్తున్న 189 కెమెరాలను పూర్తిగా పరిశీలించామని, ఎక్కడా ఆ మహిళలు కనిపించలేదని వివరించారు. నిందితుడిగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్‌కు గతంలో ఎలాంటి క్రైమ్ హిస్టరీ లేదన్నారు. కానీ అప్పుడప్పుడు మద్యం తాగే అలవాటుందని ఆ నివేదికలో వెల్లడించారు. ఈ క్రమంలో మరోసారి పోలీసులతో కలసి బాధితురాలు ఆరోపిస్తున్న ప్రదేశం, అతని సహోద్యోగులను విచారించాలని డీఎంఈ గాంధీ అధికారులకు సూచించినట్లు సమాచారం.

మరోవైపు మెడికల్ రిపోర్ట్ నమూనాల పరీక్షల్లోనూ మత్తు ప్రయోగం ఆనవాళ్లు లేవని వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో బాధితురాలు నిందితులు తనకు క్లోరోఫాం, మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలు నుంచి రక్తంతో సహా వివిధ నమూనాలను సేకరించిన ఫోరెన్సిక్‌.. వీటి ఫలితాల్లో క్లోరోఫాం సహా ఇతరాల ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులకు రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ల్యాబ్ టెక్నిషియన్ ఉమ మహేశ్వర్ , ముగ్గురు సెక్యూరిటీలు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు గాంధీ అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News