వారిని టీమ్‌ఇండియా బౌలర్లు అడ్డుకోగలరు : గంభీర్
దిశ, స్పోర్ట్స్: రెండేళ్ల క్రితం ఆసీస్ పర్యటనకు వచ్చినప్పుడు జట్టులో వార్నర్, స్మిత్‌లు లేరు. అందుకే, టీమ్‌ఇండియా సిరీస్ నెగ్గగలిగింది. ఈసారి వీరిద్దరు జట్టులో ఉన్నారు. భారత జట్టు తేలికగా ఓడిపోతుంది. గత కొన్ని రోజులుగా మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు చేస్తున్న వ్యాఖ్యలు ఇవి. నిజంగా ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు తేలిపోతుందా. వార్నర్, స్మిత్‌లు ఆసీస్‌ను గట్టెక్కిస్తారా అంటే మాజీ క్రికెటర్ గంభీర్ కాదని అంటున్నాడు. ఎంత మంది వార్నర్లు, స్మిత్‌లు వచ్చినా టీమ్ఇండియా భయపడదని […]
దిశ, స్పోర్ట్స్: రెండేళ్ల క్రితం ఆసీస్ పర్యటనకు వచ్చినప్పుడు జట్టులో వార్నర్, స్మిత్‌లు లేరు. అందుకే, టీమ్‌ఇండియా సిరీస్ నెగ్గగలిగింది. ఈసారి వీరిద్దరు జట్టులో ఉన్నారు. భారత జట్టు తేలికగా ఓడిపోతుంది. గత కొన్ని రోజులుగా మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు చేస్తున్న వ్యాఖ్యలు ఇవి. నిజంగా ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు తేలిపోతుందా. వార్నర్, స్మిత్‌లు ఆసీస్‌ను గట్టెక్కిస్తారా అంటే మాజీ క్రికెటర్ గంభీర్ కాదని అంటున్నాడు. ఎంత మంది వార్నర్లు, స్మిత్‌లు వచ్చినా టీమ్ఇండియా భయపడదని చెబుతున్నాడు. వారిద్దరికీ టీమ్‌ఇండియా బౌలర్లు చుక్కలు చూపించడం ఖాయమన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన గంభీర్ ‘ఏ పరిస్థితుల్లోనైనా.. ఏ జట్టుకైనా మన పేసర్లు సవాల్ విసరగలరు. గత ఆసీస్ పర్యనటలో మనోళ్లు అదరగొట్టారు. ఈసారి కూడా ఆతిథ్య జట్టుకు దీటుగా ప్రదర్శన చేస్తారు. ఈసారి వార్నర్, స్మిత్ ఆడుతున్నా భయపడాల్సిన అవసరం లేదు. మన పేసర్లు వాళ్లకు కూడా చుక్కలు చూపిస్తారు’ అని అభిప్రాయపడ్డాడు. రెండేళ్ల క్రితం బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంలో వార్నర్, స్మిత్ నిషేధానికి గురయ్యారు. 2018లో భారత జట్టు పర్యటించినప్పుడు వీళ్లు జట్టులో లేరు. అప్పుడు టీమ్‌ఇండియా గెలిచి రికార్డు సృష్టించింది.