పుదుచ్చేరిలో దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేత
పుదుచ్చేరిలో దశల వారీగా లాక్ డౌన్, కర్ఫ్యూను ఎత్తివేస్తామని సీఎం నారాయణస్వామి ప్రకటించారు. లాక్‌డౌన్ ఇలానే కొనసాగించడం సాధ్యం కాదన్నారు. మే 3 తరువాత దశలవారీగా ఆంక్షలు సడలిస్తామన్నారు. కేంద్ర ఆర్థిక సహాయమంత్రి జితేంద్ర సింగ్‌తో పాటు రాష్ట్ర కేబినెట్‌లో చర్చించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామని నారాయణస్వామి తెలిపారు. పుదుచ్చేరిలో ప్రస్తుతం మూడు పాజిటివ్ కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయన్నారు. వీరు కూడా త్వరలోనే డిశ్చార్జి కానున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న పుదుచ్చేరి వాసులను […]
పుదుచ్చేరిలో దశల వారీగా లాక్ డౌన్, కర్ఫ్యూను ఎత్తివేస్తామని సీఎం నారాయణస్వామి ప్రకటించారు. లాక్‌డౌన్ ఇలానే కొనసాగించడం సాధ్యం కాదన్నారు. మే 3 తరువాత దశలవారీగా ఆంక్షలు సడలిస్తామన్నారు. కేంద్ర ఆర్థిక సహాయమంత్రి జితేంద్ర సింగ్‌తో పాటు రాష్ట్ర కేబినెట్‌లో చర్చించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామని నారాయణస్వామి తెలిపారు. పుదుచ్చేరిలో ప్రస్తుతం మూడు పాజిటివ్ కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయన్నారు. వీరు కూడా త్వరలోనే డిశ్చార్జి కానున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న పుదుచ్చేరి వాసులను రప్పించేందుకు కేంద్రం అనుమతించాలని సీఎం కోరారు. పుదుచ్చేరిలో పేదలకు నెలకు 10 కిలోల బియాన్ని పంపిణీ చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.
Tags: Puducherry, lockdown, cm narayana swamy, may 3