కేంద్రానికి ఉన్నన్ని ఆర్థిక వనరులు రాష్ట్రాలకు ఉండవు.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

దిశ, ఏపీ బ్యూరో: పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంధన ధరల తగ్గింపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో మంత్రి బుగ్గన సోమవారం కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. అన్ రాక్ ఆర్బిట్రేషన్ పరిష్కారానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. అనంతరం నూతనంగా ఆర్ధిక శాఖ సహాయ మంత్రులుగా నియమించబడిన మంత్రులు భగవత్ కరాడ్, పంకజ్ చౌదరిని మర్యాద పూర్వకంగా […]

Update: 2021-11-08 07:55 GMT

దిశ, ఏపీ బ్యూరో: పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంధన ధరల తగ్గింపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో మంత్రి బుగ్గన సోమవారం కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. అన్ రాక్ ఆర్బిట్రేషన్ పరిష్కారానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. అనంతరం నూతనంగా ఆర్ధిక శాఖ సహాయ మంత్రులుగా నియమించబడిన మంత్రులు భగవత్ కరాడ్, పంకజ్ చౌదరిని మర్యాద పూర్వకంగా కలిశారు. సహాయ మంత్రులకు రాష్ట్ర పరిస్థితులు వివరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఇంధన ధరల తగ్గింపుపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతమాత్రంగానే ఉందని.. ఈ సమయంలో ధరలు తగ్గిస్తే రాష్ట్ర ఖజానాపై మరింత భారం పడే అవకాశం ఉందని వివరించారు. కేంద్రానికి ఉన్నన్ని ఆర్థిక వనరులు రాష్ట్రాలకు ఉండవని, కేంద్రం నిర్ణయం తీసుకున్న గంటల వ్యవధిలో రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవడం కుదరదని చెప్పుకొచ్చారు. కొన్ని రాష్ట్రాలు తీసుకున్నా అవి వారి ఆర్ధిక పరిస్థితిని బట్టి ఈ నిర్ణయం తీసుకోని ఉంటాయన్నారు. రాష్ట్రానికి పెట్రోల్, ఎక్సైజ్ ద్వారా మాత్రమే ఆదాయం వస్తుందని బుగ్గన తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి బుగ్గన క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే పెంచిన పన్నును కొంతమేర తగ్గించినట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News