మద్యం మత్తులో తండ్రి కొడుకుల మధ్య వాగ్వాదం.. చివరికి?

అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది.

Update: 2025-04-15 03:58 GMT
మద్యం మత్తులో తండ్రి కొడుకుల మధ్య వాగ్వాదం.. చివరికి?
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. జిల్లాలోని రైల్వే కోడూరు మండలం పిట్లవారిపల్లెలో మద్యం మత్తులో తండ్రి వెంకటయ్య, కుమారుడు చింతల శివల మధ్య వాగ్వాదం జరిగింది. చిన్నగా మొదలైన గొడవ ముదిరి చివరికి ఇద్దరి మధ్య దాడి జరిగింది. ఈ క్రమంలో కత్తితో దాడి ప్రాణాల మీదకు తెచ్చింది. తండ్రి వెంకటయ్య తన కుమారుడి తలపై కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయమైంది. ఈక్రమంలో వెంటనే గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కోడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం, పరిస్థితి విషమించడంతో శివను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే వారిద్దరి మధ్య గోడవకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News