‘ఆ ఫొటోలు తప్పని తేలితే నాపై చర్యలు తీసుకోవచ్చు’.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

టీటీడీ ఎస్వీ గోశాలలో మూడు నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయాయని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే

Update: 2025-04-15 05:17 GMT
‘ఆ ఫొటోలు తప్పని తేలితే నాపై చర్యలు తీసుకోవచ్చు’.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: టీటీడీ ఎస్వీ గోశాలలో మూడు నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయాయని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. చనిపోయిన ఆవుల వివరాలను టీటీడీ అధికారులు దాచిపెడుతున్నారని ఇటీవల వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించి.. ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ ఛైర్మన్, ఈవో శ్యామలరావు స్పందిస్తూ.. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 2 వేల మంది తమవారేనని భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలో టీటీడీలో జరిగే పరిణామల పై వారు ఎప్పటికప్పుడు తమకు సమాచారం ఇస్తూనే ఉంటారని అన్నారు. ఈనేపథ్యంలో ఆయన సంచలన సవాల్ విసిరారు. ఎస్వీ గోశాలలో ఆవుల మృతిపై నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటా అని ఆయన తేల్చి చెప్పారు. నేను విడుదల చేసిన ఫొటోలు తప్పని తేలితే నాపై చర్యలు తీసుకోవచ్చని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆ ఫొటోలు నిజమైతే టీటీడీ ఈవో, ఛైర్మన్‌ను తొలగించాలి అని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. 

Tags:    

Similar News