అమెరికాలో చాలా రాష్ట్రాలు కరోనా రహితంగా మారుతున్నాయి : ట్రంప్
వాషింగ్టన్ : అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి గణనీయంగా తగ్గుముఖం పట్టిందని.. కరోనా రహిత రాష్ట్రాలుగా మారి సురక్షితంగా తయారవుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బుధవారం తన ట్విట్టర్ ఖాతాలో ఒక సందేశాన్ని పోస్టు చేశారు. రాష్ట్రాలు కరోనా నుంచి క్షేమంగా బయటపడుతున్నాయి. మా దేశం మళ్లీ తమ వాణిజ్య కార్యాకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. దేశంలోని వయోవృద్ధులైన పౌరుల ఆరోగ్యానికి మరింత శ్రద్ధ వహిస్తాం. వారందరి జీవితాలు మరింత మెరుగ్గా ఉండేందుకు […]
వాషింగ్టన్ : అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి గణనీయంగా తగ్గుముఖం పట్టిందని.. కరోనా రహిత రాష్ట్రాలుగా మారి సురక్షితంగా తయారవుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బుధవారం తన ట్విట్టర్ ఖాతాలో ఒక సందేశాన్ని పోస్టు చేశారు. రాష్ట్రాలు కరోనా నుంచి క్షేమంగా బయటపడుతున్నాయి. మా దేశం మళ్లీ తమ వాణిజ్య కార్యాకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. దేశంలోని వయోవృద్ధులైన పౌరుల ఆరోగ్యానికి మరింత శ్రద్ధ వహిస్తాం. వారందరి జీవితాలు మరింత మెరుగ్గా ఉండేందుకు కృషిచేస్తాం అని ట్రంప్ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ఇందులో కాస్త చమత్కారం కూడా జోడించారు. దేశంలోని వయోవృద్ధులందరికీ అని తర్వాత నేను తప్ప అని బ్రాకెట్లలో కోట్ చేశారు. అంటే నన్ను తప్ప అందరినీ ప్రత్యేక శ్రద్ధతో చూస్తాం అని ఛమత్కరించారు.
Tags: coronavirus, america, free, donald trump, states, twitter, old age