మానసిక క్షోభకు గురవుతున్నాం.. STU ఆవేదన

దిశ, మెదక్: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మెదక్ జిల్లా సర్వసభ్య సమావేశం శుక్రవారం రామాయంపేటలో జరిగింది. సమావేశం అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా ప్రణీద్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా రాజగోపాల్ గౌడ్, ఆర్థిక కార్యదర్శిగా దుర్గా రాములు, రాష్ట్ర కౌన్సిలర్‌లుగా శ్రీనివాస్, నర్సింలు, పోచయ్య, మహేందర్ రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. పాఠశాలల పరిరక్షణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను […]

Update: 2021-10-01 07:39 GMT

దిశ, మెదక్: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మెదక్ జిల్లా సర్వసభ్య సమావేశం శుక్రవారం రామాయంపేటలో జరిగింది. సమావేశం అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా ప్రణీద్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా రాజగోపాల్ గౌడ్, ఆర్థిక కార్యదర్శిగా దుర్గా రాములు, రాష్ట్ర కౌన్సిలర్‌లుగా శ్రీనివాస్, నర్సింలు, పోచయ్య, మహేందర్ రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. పాఠశాలల పరిరక్షణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని పోరాటం చేస్తామని తెలిపారు.

పారిశుధ్య కార్మికులు లేకపోవడం మూలంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పారిశుధ్య కార్మికులను నియమించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు లేక మానసిక క్షోభకు గురవుతున్నారని వాపోయారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు సదానందం గౌడ్, ఎన్నికల అధికారి సాబెర్ అలీ, ఎన్నికల పరిశీలకులు ప్రభాకర్ రెడ్డి, జిల్లాలోని అన్ని మండలాల బాధ్యులు పాల్గొన్నారు.

Tags:    

Similar News