మమత స్థానంలో పంకజ.. చక్రం తిప్పిన మంత్రి
దిశ, ఎల్బీనగర్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఆయా జోన్‌ల జెడ్సీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఎల్బీనగర్ నూతన జోనల్ కమిషనర్‌గా వి.మమతను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. జీహెచ్ఎంసీ కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న మమతను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో అడిషనల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తోన్న పంకజను కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అంతేగాకుండా.. ఎల్బీనగర్ జోనల్ […]
దిశ, ఎల్బీనగర్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఆయా జోన్‌ల జెడ్సీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఎల్బీనగర్ నూతన జోనల్ కమిషనర్‌గా వి.మమతను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. జీహెచ్ఎంసీ కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న మమతను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో అడిషనల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తోన్న పంకజను కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అంతేగాకుండా.. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తోన్న ఉపేందర్ రెడ్డిని నల్గొండ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఒక్క రోజులోనే ప్రభుత్వ ఉత్తర్వులు తారుమారు కావడం పలువురిని విస్మయానికి గురిచేసింది. పంకజను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా, మమతను అదే స్థానంలో కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా నియమిస్తూ మరో జీవోను విడుదల చేసింది. ప్రభుత్వ జీవోలను మార్చడం వెనుక ఓ మంత్రి చక్రం తిప్పినట్లుగా సమాచారం.