ఇది మంచి ఆలోచన: వంటేరు ప్రతాప్ రెడ్డి
దిశ, గజ్వేల్: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలో కోవిడ్ పై అవగాహన కలిగించడం కోసం ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. జగదేవపూర్ మండలంలో ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు కిరణ్ గౌడ్ తన సొంత ఖర్చులతో మండలంలోని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని కోవిడ్ బారిన పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో జగదేవపూర్ ఎల్లమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా […]
దిశ, గజ్వేల్: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలో కోవిడ్ పై అవగాహన కలిగించడం కోసం ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. జగదేవపూర్ మండలంలో ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు కిరణ్ గౌడ్ తన సొంత ఖర్చులతో మండలంలోని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని కోవిడ్ బారిన పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో జగదేవపూర్ ఎల్లమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, స్వీయ నియంత్రణే మనకు శ్రీరామ రక్షా అని, కోవిడ్ కు సరియైన వాక్సిన్ వచ్చే వరకు ఏ మాత్రం ఏమరుపాటుతనము ఉండకూడదని, బయటకు వెళ్లిన ప్రతిసారి వీలైనన్ని సార్లు చేతులని శానిటేషన్ చేసుకోవాలన్నారు. మాస్క్ లు ధరించాలని సూచించారు. అంతేకాకుండా ప్రజలకు కోవిడ్ పై అవగాహన కలిగించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు. సొంత ఖర్చులతో వాహనాన్ని ఏర్పాటు చేసి సమాజానికి సేవ చేయాలని మంచి ఆలోచన ఉన్న కిరణ్ గౌడ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ ఇంద్రసేనా రెడ్డి, ఎంపీపీ బాలేశం గౌడ్, స్థానిక ఎంపీటీసీ కవిత రెడ్డి, స్థానిక పీఏసీఎస్ డైరెక్టర్ పానుగట్ల శ్రీనివాస గౌడ్, ఇటిక్యాల సర్పంచ్ రావికంటి చంద్ర శేఖర్, చట్టపల్లి సర్పంచ్ రాచర్ల నరేష్, పీఏసీఎస్ డైరెక్టర్ భూమయ్య యాదవ్, ఆత్మ కమిటీ చైర్మన్ రంగా రెడ్డి, నాయకులు హరి, లక్ష్మణ్ రాజ్, గ్రామాల సర్పంచ్ లు, నాయకులు పాల్గొన్నారు.