హైకోర్టులో ఎస్ఈసీ లంచ్ మోషన్ పిటిషన్

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం రాత్రి జారీ చేసిన సర్క్యూలర్‌ అమలును నిలుపుదల చేస్తూ హైకోర్టు వెలువరించిన ఉత్తర్వులను జారీచేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది. ఎన్నికల వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్‌ను ఎన్నికల సంఘం దాఖలు చేయనుంది. హౌజ్ మోషన్ పిటిషన్‌గా స్వీకరించి శుక్రవారం ఉదయం వెలువరించిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలని ఈ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయనుంది. ఒకవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతున్నందున ఈ […]

Update: 2020-12-04 00:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం రాత్రి జారీ చేసిన సర్క్యూలర్‌ అమలును నిలుపుదల చేస్తూ హైకోర్టు వెలువరించిన ఉత్తర్వులను జారీచేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది. ఎన్నికల వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్‌ను ఎన్నికల సంఘం దాఖలు చేయనుంది. హౌజ్ మోషన్ పిటిషన్‌గా స్వీకరించి శుక్రవారం ఉదయం వెలువరించిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలని ఈ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయనుంది.

ఒకవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతున్నందున ఈ పిటిషన్‌కు ఉన్న అత్యవసర పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని లంచ్ మోషన్ పిటిషన్‌గా పరిగణించి వెంటనే విచారణ జరిపి నిర్ణయం వెలువరించాలని ఆ పిటిషన్‌లో విజ్ఞప్తి చేయనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్ర హోదాలో పనిచేస్తున్నందున దాని అధికారాల విషయంలో న్యాయస్థానాల జోక్యం సరికాదన్న అంశాన్ని ఈ పిటిషన్‌లో నొక్కిచెప్పాలనుకుంటోంది.

Tags:    

Similar News