రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా శశాంక్ గోయల్

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ నియమితులయ్యారు. ఇంతకాలం ఆ పదవిలో ఉన్న రజత్ కుమార్ రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించడంతో ఆ స్థానంలో శశాంక్ గోయల్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం శశాంక్ గోయల్ రాష్ట్ర కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 1990 బ్యాచ్‌కు చెందిన శశాంక్ గోయల్ గతంలో సమైక్య రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. […]

Update: 2020-03-06 09:31 GMT

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ నియమితులయ్యారు. ఇంతకాలం ఆ పదవిలో ఉన్న రజత్ కుమార్ రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించడంతో ఆ స్థానంలో శశాంక్ గోయల్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం శశాంక్ గోయల్ రాష్ట్ర కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 1990 బ్యాచ్‌కు చెందిన శశాంక్ గోయల్ గతంలో సమైక్య రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేయడానికి ముందు ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వంలో అదనపు కార్యదర్శి హోదాలో ఎంప్యానెల్ జాబితాకు కేంద్ర అపాయింట్‌మెంట్స్ కమిటీ ఇటీవలనే ఎంపిక చేసింది.

Tags : Telangana, CEO, Shashank Goyal, Rajat Kumar

Tags:    

Similar News