ఆ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ: సీఎస్
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో బేస్ స్టేషన్ టవర్స్ ఫైబరైజేషన్ విస్తరణకు సహకారం అందిస్తున్నట్టు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఆయన అధ్యక్షతన రాష్ట్ర బ్రాడ్ బ్యాండ్ కమిటీ రెండో సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. రాష్ట్రంలో 24,961 సెల్ టవర్లు ఉన్నాయని సీఎస్ అన్నారు. రాష్ట్రంలో ఇంకా 34,902 టవర్లు నిర్మించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో టవర్స్ ఫైబరైజేషన్ 35శాతం ఉందని చెప్పారు. జాతీయ బ్రాడ్ బ్యాండ్ మిషన్ విధించిన 70 శాతం లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. 109చోట్ల టవర్ల ఏర్పాటుకు […]
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో బేస్ స్టేషన్ టవర్స్ ఫైబరైజేషన్ విస్తరణకు సహకారం అందిస్తున్నట్టు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఆయన అధ్యక్షతన రాష్ట్ర బ్రాడ్ బ్యాండ్ కమిటీ రెండో సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. రాష్ట్రంలో 24,961 సెల్ టవర్లు ఉన్నాయని సీఎస్ అన్నారు. రాష్ట్రంలో ఇంకా 34,902 టవర్లు నిర్మించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో టవర్స్ ఫైబరైజేషన్ 35శాతం ఉందని చెప్పారు. జాతీయ బ్రాడ్ బ్యాండ్ మిషన్ విధించిన 70 శాతం లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. 109చోట్ల టవర్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు జారీచేస్తామని చెప్పారు. సిగ్నలింగ్ సరిగాలేని 140 పంచాయతీలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు.