గూగుల్ ప్లేస్టోర్‌కు చెక్?
దిశ, వెబ్‌డెస్క్: ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవడానికి వారధిగా ఉండే గూగుల్ ప్లేస్టోర్‌కు చెక్ పెట్టడానికి భారతీయ స్టార్టప్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అంతేకాకుండా డిజిటల్ రంగంలో ఏకఛత్రాధిపత్యం చూపిస్తున్న గూగుల్, ఫేస్‌బుక్ వంటి అగ్ర కంపెనీలకు చెక్ పెట్టాలని ఈ స్టార్టప్ కంపెనీలు పూనుకున్నాయి. ఈ విషయం గురించి ఇటీవల ఈ స్టార్టప్ కంపెనీలన్నీ ఒక జూమ్ మీటింగ్ ద్వారా చర్చించుకున్నాయి. ఈ మీటింగ్‌లో 56 మంది స్థాపకులు పాల్గొన్నారు. ఇందులో ప్రముఖంగా గూగుల్ ప్లేస్టోర్ ప్రత్యామ్నాయంగా […]
దిశ, వెబ్‌డెస్క్: ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవడానికి వారధిగా ఉండే గూగుల్ ప్లేస్టోర్‌కు చెక్ పెట్టడానికి భారతీయ స్టార్టప్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అంతేకాకుండా డిజిటల్ రంగంలో ఏకఛత్రాధిపత్యం చూపిస్తున్న గూగుల్, ఫేస్‌బుక్ వంటి అగ్ర కంపెనీలకు చెక్ పెట్టాలని ఈ స్టార్టప్ కంపెనీలు పూనుకున్నాయి. ఈ విషయం గురించి ఇటీవల ఈ స్టార్టప్ కంపెనీలన్నీ ఒక జూమ్ మీటింగ్ ద్వారా చర్చించుకున్నాయి. ఈ మీటింగ్‌లో 56 మంది స్థాపకులు పాల్గొన్నారు. ఇందులో ప్రముఖంగా గూగుల్ ప్లేస్టోర్ ప్రత్యామ్నాయంగా మరో యాప్ తీసుకురావాలనే విషయం గురించి మాట్లాడుకున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సాయం కూడా కోరాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల పాలసీ ఉల్లంఘనల దృష్ట్యా పేటీఎం యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నిషేధించిన సంగతి తెలిసిందే. అలా నిషేధం విధించడం వల్ల పేటీఎం కార్యకలాపాలన్నీ రెండు రోజుల పాటు స్తంభించిపోయి, నష్టాలు వాటిల్లాయి. యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి గూగుల్ ప్లేస్టోర్ మాత్రమే వారధిగా ఉండటంతో ఈ నష్టాలు వచ్చాయని, అందుకు దానికి ప్రత్యామ్నాయం తయారుచేసుకోవాలని ఈ మీటింగ్‌లో పాల్గొన్న పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ అన్నారు. ఇప్పటికే అమెరికాలో గూగుల్, ఆపిల్ సంస్థల ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి స్టార్టప్ కంపెనీలు ఒక యూనియన్‌గా ఏర్పడి పోరాడుతున్న సంగతిని ఆయన గుర్తుచేశారు. అదేవిధంగా భారతదేశంలో కూడా స్టార్టప్ సంస్థలన్నీ కలిసి ఏదో విధంగా గూగుల్ ఆధిపత్యానికి చెక్ పెట్టే ప్రయత్నం చేయాలని వాళ్లు పిలుపునిచ్చారు. అయితే ఇది ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలంటే వేచి చూడకతప్పదు!