రైతులు దళారులను ఆశ్రయించొద్దు: మంత్రి అల్లోల
మక్కలు అమ్ముకునే రైతులు నష్టపోకుండా ప్రభుత్వం దండిగా నిధులు మంజూరు చేసిందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సకాలంలో డబ్బులు అందజేస్తున్నదని చెప్పారు. సోమవారం సారంగపూర్ మండలం జామ్ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. కరోనా కారణంగా లాక్ డౌన్ అమలులో ఉందని అయినప్పటికీ మక్కలు అమ్ముకునే రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం పెద్ద మొత్తంలో కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసిందని […]
మక్కలు అమ్ముకునే రైతులు నష్టపోకుండా ప్రభుత్వం దండిగా నిధులు మంజూరు చేసిందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సకాలంలో డబ్బులు అందజేస్తున్నదని చెప్పారు. సోమవారం సారంగపూర్ మండలం జామ్ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. కరోనా కారణంగా లాక్ డౌన్ అమలులో ఉందని అయినప్పటికీ మక్కలు అమ్ముకునే రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం పెద్ద మొత్తంలో కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు జరపాలని సూచించారు.
tags;Minister allola Indrakaran reddy,Start of Corn Purchase Center