High Court : ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేయండి : హైకోర్ట్ కీలక ఉత్తర్వులు
తెలంగాణ హైకోర్ట్(TS High Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ హైకోర్ట్(TS High Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఫిర్యాదుల పెట్టెలు(Complaint Boxes) ఏర్పాటు చేయాలని ఆదేశాలు వెలువరించింది. రిజిస్ట్రార్ ఆఫీసుల్లో తక్షణమే ఫిర్యాదులకు, వినతులకు బాక్సులు ఏర్పాటు చేయాలని.. వాటిపై రిజిస్ట్రార్ లేదా ఆపై స్థాయి అధికారులు పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ప్రజల్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల మీద నమ్మకం కలిగించడం చాలా ముఖ్యమని, అందుకని తక్షణమే ఈ బాక్సులు అందుబాటులోకి వచ్చేలా చూడాలని తెలిపింది. కాగా ఇటువంటి పెట్టెలను ఏర్పాటు చేయమని మార్గదర్శకాలు జారీ చేశామని, కానీ అధికారులు అలసత్వం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది.