స్టార్‌లింక్ ప్రయోగం విజయవంతం?

దిశ, వెబ్‌డెస్క్: మారుమూల ప్రాంతాలకు కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించే ఉద్దేశంతో ‘స్పేస్‌ఎక్స్’ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్టార్‌లింక్ శాటిలైట్ ప్రయోగం దాదాపుగా సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పంపించిన 900ల వరకు స్టార్‌లింక్ శాటిలైట్‌లతో అమెరికాలోని పలు మారుమూల ప్రాంతాల్లో చేసిన పైలెట్ టెస్టింగ్‌లో ఈ విషయం తెలిసింది. వాతావరణ పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నప్పటికీ తమకు 150 నుంచి 200 ఎంబీపీఎస్ వరకు ఇంటర్నెట్ స్పీడ్ వచ్చిందని యూజర్లు చెబుతున్నారు. ఈ పైలెట్ టెస్టింగ్ కోసం […]

Update: 2020-11-16 05:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: మారుమూల ప్రాంతాలకు కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించే ఉద్దేశంతో ‘స్పేస్‌ఎక్స్’ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్టార్‌లింక్ శాటిలైట్ ప్రయోగం దాదాపుగా సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పంపించిన 900ల వరకు స్టార్‌లింక్ శాటిలైట్‌లతో అమెరికాలోని పలు మారుమూల ప్రాంతాల్లో చేసిన పైలెట్ టెస్టింగ్‌లో ఈ విషయం తెలిసింది. వాతావరణ పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నప్పటికీ తమకు 150 నుంచి 200 ఎంబీపీఎస్ వరకు ఇంటర్నెట్ స్పీడ్ వచ్చిందని యూజర్లు చెబుతున్నారు. ఈ పైలెట్ టెస్టింగ్ కోసం ఒక ట్రైపాడ్, వై ఫై రూటర్ ఉన్న స్టార్‌లింక్ కిట్‌ను కొందరు యూజర్లకు అందజేశారు. వారి పేర్లు బయటికి చెప్పొద్దని అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు.

ఇటీవల నవంబర్ 6న స్టార్‌లింక్ శాటిలైట్ల పైలెట్ టెస్టింగ్ ప్రారంభించారు. గడ్డకట్టే చలి ఉన్నా, విపరీతమైన గాలులు ఉన్నా తమకు కనీసం 120 ఎంబీపీఎస్, గరిష్టంగా 200 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ పనిచేసిందని ఈ యూజర్ల స్టార్‌లింక్ రెడ్‌ఇట్ కమ్యూనిటీలో వెల్లడించారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్స్ కూడా వారు పోస్ట్ చేశారు. అప్‌లోడ్, డౌన్‌లోడ్ వేగాలు ఒక్కోసారి 15 ఎంబీపీఎస్ దగ్గర స్థిరంగా పనిచేశాయని తెలిపారు. అయితే వాతావరణం అకస్మాత్తుగా మారితే మాత్రం ఇంటర్నెట్ వేగం దారుణంగా పడిపోయి, మళ్లీ కాసేపటికి పుంజుకుంటోందని మారుమూల ప్రాంతం మోంటానాకు చెందిన ఒక యూజర్ పోస్ట్ చేశారు. సియాటెల్‌లో 208.63 డౌన్‌లోడ్ స్పీడ్‌తో స్టార్‌లింక్ రికార్డు సృష్టించింది. ఈ ఇంటర్నెట్ వేగాలను చూస్తే, స్టార్‌లింక్ శాటిలైట్లు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ స్థితిగతులు మొత్తం మారిపోయి, ఒక కొత్త విప్లవం వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News