స్టార్ స్పోర్ట్స్‌లో 3టీ క్రికెట్ లైవ్
దిశ, స్పోర్ట్స్: ప్రముఖ క్రీడా ఛానల్ స్టార్ స్పోర్ట్స్‌లో మూడు నెలల తర్వాత లైవ్ క్రికెట్ మ్యాచ్ ప్రసారం కానున్నది. కరోనా కారణంగా క్రికెట్ స్తంభించిపోవడంతో ఇన్నాళ్లూ పాత మ్యాచ్‌లను రిపీటెడ్‌గా చూసిన ప్రేక్షకులకు ఈ నెల 27న లైవ్ క్రికెట్ చూసే అవకాశం కలుగబోతోంది. దక్షిణాప్రికాలో కొత్తగా కనిపెట్టిన 3టీ ఫార్మాట్‌లో ‘సాలిడరిటీ కప్’ జరుగబోతోంది. మూడు జట్లు కలిసి ఒకే మ్యాచ్ ఆడేలా రూపొందించిన ఈ ఫార్మాట్ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని నిర్వహకులు తెలుపుతున్నారు. […]
దిశ, స్పోర్ట్స్: ప్రముఖ క్రీడా ఛానల్ స్టార్ స్పోర్ట్స్‌లో మూడు నెలల తర్వాత లైవ్ క్రికెట్ మ్యాచ్ ప్రసారం కానున్నది. కరోనా కారణంగా క్రికెట్ స్తంభించిపోవడంతో ఇన్నాళ్లూ పాత మ్యాచ్‌లను రిపీటెడ్‌గా చూసిన ప్రేక్షకులకు ఈ నెల 27న లైవ్ క్రికెట్ చూసే అవకాశం కలుగబోతోంది. దక్షిణాప్రికాలో కొత్తగా కనిపెట్టిన 3టీ ఫార్మాట్‌లో ‘సాలిడరిటీ కప్’ జరుగబోతోంది. మూడు జట్లు కలిసి ఒకే మ్యాచ్ ఆడేలా రూపొందించిన ఈ ఫార్మాట్ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని నిర్వహకులు తెలుపుతున్నారు. ఇండియన్ సబ్ కాంటినెంట్‌లో ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రసారం చేయనుంది. ది ఈగల్స్ జట్టుకు ఏబీ డివిలియర్స్, ది కైట్స్ జట్టుకు క్వింటన్ డీకాక్, ది కింగ్ ఫిషర్స్ జట్టుకు కగిసో రబాడా నాయకత్వం వహిస్తున్నారు.