మళ్లీ వస్తున్న బిగ్ బాస్ -3
దిశ వెబ్ డెస్క్: కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఇళ్లలో ఉన్నవారి కాలక్షేపం కావడం లేదు. సీరియళ్లు కూడా రావడం లేదు. షూటింగ్ లు బంద్ కావడంతో… కొత్త ప్రోగ్రామ్ లు, గేమ్ షోలు వచ్చే అవకాశం లేదు. సినిమాలు కూడా వచ్చినవే వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే.. ప్రేక్షకుల అలనాటి రామాయనం, మహాభారతం సీరియళ్లను చూడాలనుకున్నారు. ట్విట్టర్ లో రిక్వెస్ట్ పెట్టారు. ప్రేక్షకుల కోరిక మేరకు దూరదర్శన్ చానల్ […]
దిశ వెబ్ డెస్క్: కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఇళ్లలో ఉన్నవారి కాలక్షేపం కావడం లేదు. సీరియళ్లు కూడా రావడం లేదు. షూటింగ్ లు బంద్ కావడంతో… కొత్త ప్రోగ్రామ్ లు, గేమ్ షోలు వచ్చే అవకాశం లేదు. సినిమాలు కూడా వచ్చినవే వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే.. ప్రేక్షకుల అలనాటి రామాయనం, మహాభారతం సీరియళ్లను చూడాలనుకున్నారు. ట్విట్టర్ లో రిక్వెస్ట్ పెట్టారు. ప్రేక్షకుల కోరిక మేరకు దూరదర్శన్ చానల్ ఇటీవలే రామయణం సీరియల్ ను పున:ప్రారంభించింది. మహా భారత్ ను కూడా ప్రసారం చేస్తోంది. ఇదే విధంగా ‘స్టార్ మా’ కూడా టీవీ వీక్షకులకు వినోదాన్ని పంచడానికి బిగ్‌బాస్ తెలుగు సీజన్-3ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపింది.
బుల్లితెరపై ‘బిగ్ బాస్ ’ ఓ సక్సెస్ ఫుల్ గేమ్ షో. ఇందులో పార్టిసిపేట్ చేసే సెలబ్రెటీల నుంచి… గేమ్ హోస్ట్ చేసే బిగ్ సెలబ్రెటీ వరకు అందరూ ప్రేక్షకులను అలరిస్తారు. తెలుగు బుల్లితెరపై ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా ముగించుకుని .. నాలుగో సీజన్ కు రెడీ అవుతోంది. అయితే కరోనా కారణంగా ఈ సారి బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు మొదలవుతోందో చెప్పలేం. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ -3 సీజన్ నే మళ్లీ ప్రేక్షకుల ముందుకు స్టార్ మా తీసుకు రానుంది. సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం మూడు గంటలకు బిగ్‌బాస్ తెలుగు సీజన్-3 మెమొరీస్‌ను ప్రసారం చేయనున్నట్టు స్టార్ మా వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్‌లో ఒక ప్రకటన చేసింది. ‘21 రోజుల లాక్‌డౌన్ సమయంలో ప్రతిఒక్కరు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నట్టు అనుభూతి పొందుతున్నారు. అందుకే మరోసారి బిగ్‌బాస్ తెలుగు సీజన్-3 మెమొరీస్‌ని చూసేద్దాం’ అని పేర్కొంది. కాగా, నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ తెలుగు సీజన్-3 మూడు నెలలకు పైగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఇందులో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలువగా, శ్రీముఖి రన్నరప్‌గా నిలిచారు.
Tags : corona virus, lock down, big boss, star maa, nagarjuna, rahul sipligunj, srimukhi,