తేల్చేయండి

దిశ, స్పోర్ట్స్: కరోనా సంక్షోభం కారణంగా అన్నిరంగాల్లో ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. క్రికెట్ పూర్తిగా స్తంభించిపోవడంతో రూ.వేల కోట్లు పోసి కొన్న హక్కులు నిరుపయోగంగా మారిపోయాయి. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్‌ల నిర్వహణపై బీసీసీఐ, ఐసీసీలు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తుండటంతో ప్రసార హక్కులు కలిగిన స్టార్ గ్రూప్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో వెంటనే ఈ రెండు ఈవెంట్లపై నిర్ణయం తీసుకోవాలని కోరుతూ బీసీసీఐ, ఐసీసీకి విడివిడిగా లేఖలు రాసినట్లు సమాచారం. ఐపీఎల్, […]

Update: 2020-06-25 06:50 GMT

దిశ, స్పోర్ట్స్: కరోనా సంక్షోభం కారణంగా అన్నిరంగాల్లో ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. క్రికెట్ పూర్తిగా స్తంభించిపోవడంతో రూ.వేల కోట్లు పోసి కొన్న హక్కులు నిరుపయోగంగా మారిపోయాయి. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్‌ల నిర్వహణపై బీసీసీఐ, ఐసీసీలు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తుండటంతో ప్రసార హక్కులు కలిగిన స్టార్ గ్రూప్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో వెంటనే ఈ రెండు ఈవెంట్లపై నిర్ణయం తీసుకోవాలని కోరుతూ బీసీసీఐ, ఐసీసీకి విడివిడిగా లేఖలు రాసినట్లు సమాచారం. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై మరింత జాప్యం చేస్తే ప్రసార హక్కులపై కూడా మేం పునరాలోచించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ రెండు ఈవెంట్లపై త్వరగా నిర్ణయం తీసుకుంటే టీవీ షెడ్యూల్స్, మార్కెటింగ్ ప్రణాళికలు మరోసారి పునఃసమీక్షించుకుంటామని, ప్రస్తుత పరిస్థితుల్లో అడ్వర్టైజర్స్‌ను తీసుకొని రావడం కూడా కష్టం కాబట్టి.. త్వరగా నిర్ణయం తెలియజేయాలని ఆ లేఖలో కోరింది. సరిగ్గా ఐసీసీ సమావేశం జరగడానికి కొన్ని గంటల ముందే స్టార్ ఈ లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

హక్కుల రేటు తగ్గించండి

కరోనా సంక్షోభం ఒకవైపు నడుస్తుండగా మరోవైపు బీసీసీఐ, ఐసీసీ జాప్యం స్టార్ ఇండియాను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా రూ. 3వేల కోట్ల ఆదాయాన్ని అంచనా వేసింది. త్వరగా ఐపీఎల్‌పై నిర్ణయం తీసుకోకపోతే ఈ ఆదాయం మరింతగా దిగజారిపోతుందని, వెంటనే ఏదో ఒకటి చేయాలని బీసీసీఐతో చర్చించినట్లు తెలుస్తున్నది. ఐపీఎల్ జరగకపోతే తాము చెల్లిస్తున్న ఫీజు ధరను తగ్గించాలని బీసీసీఐని కోరినట్లు కూడా సమాచారం. మరోవైపు ఐసీసీని కూడా దాదాపు ఇలాగే లేఖ రాసినట్లు తెలుస్తున్నది. దీనిపై ‘ఇన్‌సైడ్ స్పోర్ట్’ అనే వెబ్‌సైట్ వివరణ కోరగా ఐసీసీ తమ వ్యాపార లావాదేవీల విషయాలను బయటకు చెప్పదు అని స్పష్టం చేశారు.

ఇప్పటికే కరోనా నేపథ్యంలో వ్యాపార ప్రకటనలు ఇవ్వడానికి చాలా కంపెనీలు మొగ్గు చూపడం లేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ ద్వారా స్టార్ గ్రూప్ అంచనా వేసిన ఆదాయంలో సగం కూడా రాదని నిపుణులు చెబుతున్నారు. ఐదేండ్ల కాలపరిమితికి ఐపీఎల్‌ను రూ.16,347కోట్లకు, 2018-23 వరకు బీసీసీఐ హోం రైట్స్ రూ.6,138కోట్లకు, 2015-23 వరకు ఐసీసీ గ్లోబల్ రైట్స్ రూ.14వేల కోట్లకు దక్కించుకుంది. కరోనా కారణంగా ఇప్పుడీ పెట్టుబడి అంతా ఒక ఏడాది వృథా అయ్యే అవకాశం ఉండటంతోనే స్టార్ గ్రూప్ ఘాటుగా లేఖ రాసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News