సినిమా ఆర్టిస్ట్ కావాలనేది మీ కలనా..? అయితే ఇది మీకొక మంచి అవకాశం
దిశ, వెబ్‌డెస్క్: నటీనటులు కావాలనేది చాలామంది కల. అయితే, అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఉచిత శిక్షణ అందిస్తోంది. రంగస్థలం నుంచి వెండితెర వరకు (స్టేజ్ టు స్ర్కీన్) బహుభాషా నటన, థియేటర్, ఫిల్మ్‌పై వర్క్ షాప్ ఏర్పాటు చేసింది. ఇందులో పాల్గొని నైపుణ్యత కలిగిన నటులుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. అడ్ల సతీష్ కుమార్ మరియు బృందం ఆధ్వర్యంలో ఈ […]
దిశ, వెబ్‌డెస్క్: నటీనటులు కావాలనేది చాలామంది కల. అయితే, అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఉచిత శిక్షణ అందిస్తోంది. రంగస్థలం నుంచి వెండితెర వరకు (స్టేజ్ టు స్ర్కీన్) బహుభాషా నటన, థియేటర్, ఫిల్మ్‌పై వర్క్ షాప్ ఏర్పాటు చేసింది. ఇందులో పాల్గొని నైపుణ్యత కలిగిన నటులుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. అడ్ల సతీష్ కుమార్ మరియు బృందం ఆధ్వర్యంలో ఈ ఉచిత శిక్షణను ప్రభుత్వం అందిస్తోంది. రెండు నెలల పాటు ఈ శిక్షణ కొనసాగనున్నది.
ఉద్యోగులు, విద్యార్థులకు కూడా వారాంతపు తరగతులు కూడా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. 5 నుంచి 50 ఏళ్ల వయస్సు గల వారు కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునేవారు ఈ నెల 26 వరకు రవీంద్ర భారతిలోని సమావేశ హాల్‌లో సంప్రదించాలని తెలిపారు. అయితే, ఆడిషన్స్‌కు వచ్చే వారు 2 పాస్ ఫొటోలు తీసుకురావాలని సూచించారు. ఆసక్తి ఉన్నవారు 9573585137, 9502848199 నెంబర్లకు సంప్రదించగలరని తెలిపారు.