వైద్య సిబ్బంది… మాస్క్ లు మళ్లీ మళ్లీ వాడాలి : ఎయిమ్స్
దిశ వెబ్ డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోవడంతో.. వైద్యులు, నర్సులు వాడే ఆరోగ్య పరికరాల విషయంపై ఎయిమ్స్ (ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్) కొన్ని విధివిధానాలను జారీ చేసింది. మాస్క్ లు, పీపీఈ ల కొరత ఉందని, వాటిని జాగ్రత్తగా వాడుకోవాలని వైద్య సిబ్బందికి సూచనలు అందించింది. కవరాల్స్, మాస్క్‌లు, గ్లోవ్స్, గాగుల్స్ వంటి వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ)కు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో పీపీఈలను శుద్ధిచేసి తిరిగి వినియోగంలోకి తెచ్చే అంశానికి […]
దిశ వెబ్ డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోవడంతో.. వైద్యులు, నర్సులు వాడే ఆరోగ్య పరికరాల విషయంపై ఎయిమ్స్ (ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్) కొన్ని విధివిధానాలను జారీ చేసింది. మాస్క్ లు, పీపీఈ ల కొరత ఉందని, వాటిని జాగ్రత్తగా వాడుకోవాలని వైద్య సిబ్బందికి సూచనలు అందించింది.
కవరాల్స్, మాస్క్‌లు, గ్లోవ్స్, గాగుల్స్ వంటి వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ)కు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో పీపీఈలను శుద్ధిచేసి తిరిగి వినియోగంలోకి తెచ్చే అంశానికి ప్రాధాన్యమివ్వాలంటూ అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) బుధవారం మార్గదర్శకాలను జారీచేసింది. రానున్న రోజుల్లో పీపీఈ కిట్ల కొరత తీవ్రమైతే ఈ దిశగా దృష్టిసారించక తప్పదని పేర్కొంది. కవరాల్స్, ఎన్95 మాస్క్‌లను డబ్లింగ్ డైల్యూషన్ పద్ధతిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ వేపర్‌తో శుద్ధిచేసి తిరిగి వాడవచ్చని తెలిపింది. ఫేస్ షీల్డ్, గాగుల్స్‌ను సోడియం హైపోక్లోరైడ్, ఆల్కహాల్ మిశ్రమంతో శుభ్రం చేసి పునర్వినియోగంలోకి తేవచ్చని సూచించింది. అంతేకాదు ఒక్కో మాస్కును నాలుగు సార్లు వాడాలంటూ ఎయిమ్స్ గతంలో వారిని కోరింది. ప్రతి రోజు వాడిన మాస్క్ ను గుర్తించేందుకు నంబర్ వేయాలని, నాలుగు రోజుల తర్వాత తిరిగి వాటిని వాడాలని సూచించింది.
ఎలా అంటే:
తొలి రోజు వాడిన మాస్క్ కు నెంబర్ వన్ అని రాసి బ్యాగులో పెట్టుకోవాలి. ఆ తర్వాత రోజుల్లో వాడిన వాటికి 2,3,4 నెంబర్లు వేయాలి. ఐదో రోజో… మొదటి నెంబర్ మాస్క్ ను మళ్లీ వినియోగించాలి. అలా 20 రోజుల తర్వాత వాటన్నంటినీ డిస్పోజ్ చేయాలి. అంటువ్యాధుల ప్రభావం లేని ప్రాంతాల్లో పనిచేసే వైద్య సిబ్బంది వాడిన మాస్కులు మళ్లీ వాడాలని ఎయిమ్స్ స్పష్టం చేసింది. స్క్త్రీనింగ్ ఏరియా, వార్డులు, ఐసీయూల్లో పనిచేసే సిబ్బంది కోసం మూడు రకాల కిట్లను తయారు చేశామని ఎయిమ్స్ ఉన్నతాధికారి డాక్టర్ డీకీ శర్మ వెల్లడించారు.
Tags: coronavirus, mask, using, aiims,