భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో మ‌ళ్లీ క‌రోనా పంజా

దిశ‌, ఖ‌మ్మం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా కేంద్రంలో శ‌నివారం మరో క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదైంది. హైద‌రాబాద్‌లోని ఓమెగా ప్రైవేటు ఆస్ప‌త్రిలో స్టాఫ్ న‌ర్సుగా ప‌నిచేస్తున్న మ‌హిళ‌కు పాజిటివ్ నిర్దారణ అయినట్టు కొత్త‌గూడెం జిల్లా వైద్యాధికారులు గుర్తించారు. బాధితురాలు ఈనెల 4న హైద‌రాబాద్ నుంచి తన స్వ‌స్థ‌ల‌మైన కొత్త‌గూడెంలోని ఇందిరా ప్రియ‌ద‌ర్శిని న‌గ‌ర్‌కు చేరుకుంది. అప్ప‌టికే క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌నే అనుమానంతో ల‌గేజీ ఇంటి వ‌ద్ద పెట్టి నేరుగా జిల్లా ఆస్ప‌త్రికి చేరుకుంది.ఆమె రక్త‌న‌మూనాల‌ను సేక‌రించిన కోవిడ్‌-19సెల్ […]

Update: 2020-06-06 10:21 GMT

దిశ‌, ఖ‌మ్మం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా కేంద్రంలో శ‌నివారం మరో క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదైంది. హైద‌రాబాద్‌లోని ఓమెగా ప్రైవేటు ఆస్ప‌త్రిలో స్టాఫ్ న‌ర్సుగా ప‌నిచేస్తున్న మ‌హిళ‌కు పాజిటివ్ నిర్దారణ అయినట్టు కొత్త‌గూడెం జిల్లా వైద్యాధికారులు గుర్తించారు. బాధితురాలు ఈనెల 4న హైద‌రాబాద్ నుంచి తన స్వ‌స్థ‌ల‌మైన కొత్త‌గూడెంలోని ఇందిరా ప్రియ‌ద‌ర్శిని న‌గ‌ర్‌కు చేరుకుంది. అప్ప‌టికే క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌నే అనుమానంతో ల‌గేజీ ఇంటి వ‌ద్ద పెట్టి నేరుగా జిల్లా ఆస్ప‌త్రికి చేరుకుంది.ఆమె రక్త‌న‌మూనాల‌ను సేక‌రించిన కోవిడ్‌-19సెల్ బృందం వ‌రంగ‌ల్‌‌లోని నిర్దార‌ణ ప‌రీక్ష‌ా కేంద్రానికి పంపింది.అక్కడ వెలువడిన ఫ‌లితాల్లో ఆమెకు పాజిటివ్ అని తేలింది. దీంతో వెంట‌నే బాధితురాలిని 108వాహ‌నంలో హైద‌రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.నాలుగు నెల‌ల విరామం త‌ర్వాత మళ్లీ క‌రోనా కేసు న‌మోదు కావడంతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు.ఈ క్రమంలోనే ఇందిరా ప్రియ‌ద‌ర్శిని న‌గ‌ర్‌ను కంటోన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. మూడు కిలోమీట‌ర్ల ప‌రిధిలో రాక‌పోక‌ల‌ను పూర్తిగా నిషేధించారు. ఇప్ప‌టికే ఇంటింటికి వెళ్లి ఆరోగ్య స‌ర్వే చేప‌డుతున్నారు. బాధిత మ‌హిళ‌కు సంబంధించిన జ‌ర్నీ హిస్ట‌రీ సేక‌ర‌ణ‌పై అధికారులు నిమ‌గ్న‌మ‌య్యారు. సదరు మహిళ ఈ నెల 4న హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆమె TS28Z 0038 ఇంద్రా రాజధాని భద్రాచలం డిపోకు చెందిన బస్సులో మధ్యాహ్నం 3:30 గంటలకు కొత్తగూడెం చేరుకుంది. ఆ తేదీనాడు పాజిటివ్ లక్షణాలు ఉన్న మహిళతో ఆ బస్సులో ప్రయాణించిన వారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు సూచించారు.

Tags:    

Similar News