కనిపించని రామయ్య కల్యాణ సందడి

దిశ, మహబూబ్‌నగర్: లోక కల్యాణార్థం ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే సీతారాముల కల్యాణం ఈ ఏడాది నిరాడంబరంగా సాగుతుంది. శ్రీరామ నవమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాల్సిన ఆలయాలు బోసిపోయాయి. గురువారం శ్రీరామనవమి కావడంతో ఆలయాల వద్ద ఆలయ పూజారులు, ఆలయ కమిటీ సభ్యులు మినహా ఎవరూ కనిపించడం లేదు. జిల్లావ్యాప్తంగా ఉన్న 282 ఆలయాల్లో ఎలాంటి అట్టహాసం లేకుండా సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కారోనా కారణంగా ఆలయాల్లోకి భక్తులను అనుమతించవద్దని అధికారులు ఇప్పటికే ఆదేశాలు […]

Update: 2020-04-01 21:26 GMT

దిశ, మహబూబ్‌నగర్: లోక కల్యాణార్థం ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే సీతారాముల కల్యాణం ఈ ఏడాది నిరాడంబరంగా సాగుతుంది. శ్రీరామ నవమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాల్సిన ఆలయాలు బోసిపోయాయి. గురువారం శ్రీరామనవమి కావడంతో ఆలయాల వద్ద ఆలయ పూజారులు, ఆలయ కమిటీ సభ్యులు మినహా ఎవరూ కనిపించడం లేదు. జిల్లావ్యాప్తంగా ఉన్న 282 ఆలయాల్లో ఎలాంటి అట్టహాసం లేకుండా సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కారోనా కారణంగా ఆలయాల్లోకి భక్తులను అనుమతించవద్దని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు సైతం గ్రామాల్లో కూడా ప్రజలు ఎవరూ లేకుండా కల్యాణ వేడుకలను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో సంబురాలు నిర్వహించడం వల్ల ప్రజలు గుమిగూడే ప్రమాదం ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆలయాల వద్ద ఎక్కడా భక్తులు లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Tags: Sriramanavami, celebrations, people, MAHABOOBNAGAR, EMPTY TEMPLE

Tags:    

Similar News