శ్రీరాముడికి ‘కరోనా’ కష్టాలు
దిశ, మహబూబ్‌నగర్: కరోనా ఎఫెక్ట్… శ్రీరామ నవమి వేడుకలపై పడటంతో కొద్దిరోజులుగా అర్చకులే ఆలయాలను శుభ్రం చేస్తూ, పూజలు చేసి వెళ్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించగా, ప్రజలు రాముల వారి వేడుకలకు దూరమయ్యారు. ప్రతి ఏడాది వారంముందే దేవాలయాల్లో ఉత్సవాల సందడి కనిపిస్తూ, భక్తులకు కావల్సిన ఏర్పాట్లపై అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు సమావేశాలు నిర్వహించేవారు. కానీ ఈసారి కరోనా పుణ్యమా అని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా భక్తులు వేడుకలకు దూరం […]
దిశ, మహబూబ్‌నగర్: కరోనా ఎఫెక్ట్… శ్రీరామ నవమి వేడుకలపై పడటంతో కొద్దిరోజులుగా అర్చకులే ఆలయాలను శుభ్రం చేస్తూ, పూజలు చేసి వెళ్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించగా, ప్రజలు రాముల వారి వేడుకలకు దూరమయ్యారు. ప్రతి ఏడాది వారంముందే దేవాలయాల్లో ఉత్సవాల సందడి కనిపిస్తూ, భక్తులకు కావల్సిన ఏర్పాట్లపై అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు సమావేశాలు నిర్వహించేవారు. కానీ ఈసారి కరోనా పుణ్యమా అని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా భక్తులు వేడుకలకు దూరం కావడం గమనార్హం.
లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం భక్తులను ఆలయాల్లోకి అనుమతించొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఈ సారి నిరాశ తప్పడం లేదు. ముఖ్యంగా సిరసనగండ్ల, కోయిల్ కొండా రాంకొండా రాములవారి ఆలయం, బీచుపల్లి ఆంజనేయ స్వామి, ఉర్కొండపేట అంజనేయస్వామి, మక్తల్ పడమటి అంజనేయ ఆలయాల్లో ఉత్సవాలను చాలా పెద్ద ఎత్తున నిర్వహించే వారు. కానీ ప్రస్తుత పరిస్థితులతో ఆలయాల్లో ఉత్సవ శోభ కనిపించకుండా పోయింది. జిల్లావ్యాప్తంగా 282 రాములవారి ఆలయాల్లో కనీసం రంగులు కూడా వేసే పరిస్థితి కనపడుతోంది.
ఆలయ కమిటీ సభ్యులే జాగ్రత్తలు తీసుకుని శ్రీ రాముల వారి ఉత్సవాలను నిర్వహించాలని అదేశాలు రావడంతో హంగు, ఆర్బాటాలు లేకుండా అన్నదాన కార్యక్రమాలు, ఆహ్వాన పత్రికలు లేకుండా ఉత్సవాల నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు. వేడుక సమయంలో 10మందికి మించి ఉండకూడదని, వాళ్లు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచనలు చేశారు. అదేవిధంగా ఉరేగింపులు, రథోత్సవాల కార్యక్రమాలు పూర్తిగా నిషేధించారు.
Tags: Corona Effect, Sri rama Navami festival, Cancelled, Lockdown, Mahabubnagar, Temples