ఆ రెండు జిల్లాల్లో కరోనా తగ్గుముఖం: శ్రీనివాస్ గౌడ్
దిశ, మహబూబ్‌గర్: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లా అధికారుల పనితీరు బాగుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వారి కృషి ఫలితంగా ప్రస్తుతం ఆ రెండు జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మర్కజ్ కంటే ముందే జిల్లాల్లో ఇతర రాష్ట్రాల వారిని గుర్తించి క్వారంటైన్‌లో ఉంచామని వెల్లడించారు. 10 వేల మందిని క్వారంటైన్‌లో ఉంచగా అందులో 11 మందికి పాజిటివ్ వచ్చిందని స్పష్టం చేశారు. ఇందులో […]
దిశ, మహబూబ్‌గర్: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లా అధికారుల పనితీరు బాగుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వారి కృషి ఫలితంగా ప్రస్తుతం ఆ రెండు జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మర్కజ్ కంటే ముందే జిల్లాల్లో ఇతర రాష్ట్రాల వారిని గుర్తించి క్వారంటైన్‌లో ఉంచామని వెల్లడించారు. 10 వేల మందిని క్వారంటైన్‌లో ఉంచగా అందులో 11 మందికి పాజిటివ్ వచ్చిందని స్పష్టం చేశారు. ఇందులో ప్రస్తుతం ఇద్దరు మాత్రమే గాంధీ ఆస్పత్రిలో ఉన్నారని, మిగిలిన 9 మంది డిశ్చార్జి అయ్యారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
Tags: Srinivas Goud, Comments, Corona Cases, declines, narayanpet, mahabubnagar