కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ, మహబూబ్నగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ నిబంధనలను కొంత మేరకు సడలించినప్పటికీ జిల్లావాసులు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లాలోని పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను కట్టడి చేయడంలో జిల్లా అధికారులు కష్టపడి పనిచేశారని గుర్తుచేశారు. నెల రోజుల నుంచి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆయన […]
దిశ, మహబూబ్నగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ నిబంధనలను కొంత మేరకు సడలించినప్పటికీ జిల్లావాసులు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లాలోని పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను కట్టడి చేయడంలో జిల్లా అధికారులు కష్టపడి పనిచేశారని గుర్తుచేశారు. నెల రోజుల నుంచి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలను సడలించినందున ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి అనేక మంది వలస కూలీలు జిల్లాకు వచ్చే అవకాశం ఉందన్నారు. కాబట్టి అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు.
Tags: Srinivas Goud, Telly conference, Chieftains, Corona Prevention