మహబూబ్ నగర్ లో డిసిన్ఫెక్షన్ గది ప్రారంభం

దిశ, మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు, నాయకులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా తూర్పు కమాన్ కూరగాయల మార్కెట్ వద్ద డిస్ ఇన్ఫెక్షన్ గదిని ఏర్పాటు చేయగా, దానిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కోరారు. అనంతరం సద్దలగుండు హనుమాన్ గుడి వద్ద నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. […]

Update: 2020-04-08 05:07 GMT

దిశ, మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు, నాయకులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా తూర్పు కమాన్ కూరగాయల మార్కెట్ వద్ద డిస్ ఇన్ఫెక్షన్ గదిని ఏర్పాటు చేయగా, దానిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కోరారు. అనంతరం సద్దలగుండు హనుమాన్ గుడి వద్ద నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అలాగే, ప్రధాన రహదారిపై ఉన్న పలు సూపర్ మార్కెట్లను తనిఖీ చేశారు. అక్కడ వినియోగదారులు సామాజిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం, దుకాణాల ముందు శానిటైజేషన్‌లు ఏర్పాటు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక దూరం పాటించపోతే కరోనా సోకే అవకాశాలు పెరుగుతాయని వెల్లడించారు. అలాగే, దుకాణాల యాజమాన్యాలు తమతమ షాపుల ముందు శానిటైజేషన్‌లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

Tags: srinivas goud, disinfection room, mahaboobnagar, super markets, corona, virus, lockdown, social distance

Tags:    

Similar News