వైన్ షాపుల్లో గౌడ్లకు 15శాతం వాటా చారిత్రాత్మకం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ, తెలంగాణ బ్యూరో: కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా గౌడ్లకు 15 శాతం వైన్ షాప్ లలో వాటా కల్పించాలని తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో గౌడ, ఎస్సీ, ఎస్టీ కులస్తులకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించినందుకు శుక్రవారం కులసంఘాలతో రవీంద్రభారతిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ లో పలు దుకాణాలు […]
దిశ, తెలంగాణ బ్యూరో: కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా గౌడ్లకు 15 శాతం వైన్ షాప్ లలో వాటా కల్పించాలని తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో గౌడ, ఎస్సీ, ఎస్టీ కులస్తులకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించినందుకు శుక్రవారం కులసంఘాలతో రవీంద్రభారతిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ లో పలు దుకాణాలు తెరిపించి గౌడ ఆత్మగౌరవాన్ని నిలిపారన్నారు. గౌడ్ మాత్రమే ఉత్పత్తి చేసేలా జీవో తీసుకొచ్చారని, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాలం నాటి నుండి ఉన్న డిమాండ్ కానీ ఏ ప్రభుత్వాలు వృత్తి పన్ను రద్దు చేయలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ వృత్తి పన్ను రద్దు చేయడంతో పాటు ఉచితంగా గీత కార్మికులకు లైసెన్సులు జారీ చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కులవృత్తులు అంటే ఎంతో అభిమానం పేద ప్రజలంటే ఎంతో అభిమానం కులవృత్తులకు పూర్వవైభవాన్ని తీసుకురావాలని సంకల్పంతో చిన్న చిన్న కుల వృత్తుల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
వైన్ షాప్ లలో దళితులకు 10 శాతం, గిరిజనులకు 5 శాతం, గౌడ్ లకి 15 శాతం వాటాను కల్పించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, శాసన సభ్యుడు ప్రకాష్ గౌడ్, బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్, ప్రభుత్వ విద్యా మౌలిక సదుపాయాల కల్పన శాఖ చైర్మన్ నాగేందర్ గౌడ్, గౌడ సంఘాల రాష్ట్ర నాయకులు పల్లె లక్ష్మణరావు గౌడ్, బాలగొని బాలరాజు గౌడ్, మాజీ చైర్మన్ రాజేశంగౌడ్, డాక్టర్ వట్టికూటి రామారావుగౌడ్, ప్రతాని రామకృష్ణ గౌడ్, డా. విజయ భాస్కర్ గౌడ్, నాగేశ్వరరావు, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, వేములయ్య గౌడ్, చింతల మల్లేశం గౌడ్, అయిలి వెంకన్న గౌడ్, రాజయ్య గౌడ్, ప్రతాప్ లింగం గౌడ్, అంబాల నారాయణ గౌడ్, యూనివర్సిటీ స్కాలర్స్ కేషబోయిన రవికుమార్ గౌడ్, గదరాజు చందు, రాథోడ్ నాయక్, శ్రీరామ్ గౌడ్, ఎస్సీ సంఘం నాయకుడు జంబులయ్య, ఎస్టీ నాయకుడు కిషన్ నాయక్ , రాష్ట్ర నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.