సభలో మాట్లాడింది మీరు నిరూపించగలరా..? బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై భట్టి ఫైర్
అడ్డగోలు ప్రకటనలు మీరు చూశారా? అని, అబద్దాలు ప్రచారం చేయడం మంచి పద్దతి కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: అడ్డగోలు ప్రకటనలు మీరు చూశారా? అని, అబద్దాలు ప్రచారం చేయడం మంచి పద్దతి కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Batti Vikramarka) ఫైర్ అయ్యారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session) హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. చర్చలో భాగంగా ప్రతిపక్ష నాయకుల మాటలకు మంత్రులు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (BRS MLA Palla Rajeshwar Reddy) పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు.
అసెంబ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకంపై (Rajiv Gandhi Civils Abhaya Hastham scheme) మాట్లాడారు. ఇందులో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం పేరుపై ప్రభుత్వం అడ్డగోలు ప్రకటనలు ఇచ్చింది. సివిల్స్ విద్యార్థులకు అందించిన బడ్జెట్ కంటే ప్రకటనలకే ఎక్కువ ఖర్చు చేశారని వ్యాఖ్యానించారు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి సమాధానమిస్తూ.. అభయ హస్తం పేరు మీద అడ్డగోలు ప్రకటనలు ఇచ్చామని మాట్లాడుతున్నారని, అలా మాట్లాడితే ఎలా అని మండిపడ్డారు.
రాష్ట్రం నుంచి సివిల్ సర్వీస్ పరీక్షలకు (Civil Servies Exams) మెయిన్స్, ఇంటర్వ్యూలకు ఎంపికైన వారిని ఆర్థికంగా ప్రోత్సహించాలని నిర్ణయించామని, మన రాష్ట్ర విద్యార్థులకు (Students) అవకాశం వస్తే మన ప్రతిష్ట పెరుగుతుందని, ఎప్పుడైనా అవకాశం వస్తే వారు మన రాష్ట్ర ప్రయోజనాలకు కృషి చేస్తారని ఈ పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఇది మంచి పథకమే కదా.. ఇందులో ఏం తప్పు ఉందో చెప్పాలని అడిగారు. దీనికి 4 కోట్లు ఖర్చు పెట్టి 40 కోట్లు ప్రకటనలు (Advertizements) ఇచ్చారని మాట్లాడుతున్నారని, అన్ని అన్ని ప్రకటనలు ఇచ్చింది పల్లా రాజేశ్వర్ రెడ్డి చూశారా అని ప్రశ్నించారు. ఇది మీరు నిరూపించగలరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి ప్రకటనలు చేయడం తగదని భట్టి అన్నారు.